తెలంగాణ

telangana

ETV Bharat / state

'చక్కటి శాకాహార భోజనం అంటే చాలా ఇష్టం' - హైదరాబాద్‌ తాజా వార్తలు

ఒక మంచి పాటపాడితే ఎంత చక్కటి అనుభూతి కలుగుతుందో... మంచి రుచికరమైన వంటకాలను ఆరగిస్తే అలాంటి అనుభూతే కలుగుతుందని... ప్రముఖ గాయని సునీత అన్నారు. చిన్నారి చికెన్‌ పేరిట హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను ఆమె ప్రారంభించారు.

singer Sunitha started a restaurant in Hyderabad
'చక్కటి శాకాహార భోజనం అంటే చాలా ఇష్టం'

By

Published : Mar 22, 2021, 7:55 PM IST

చక్కటి శాకాహార భోజనం అంటే చాలా ఇష్టమని ప్రముఖ సినీ గాయని సునీత అన్నారు. చిన్నారి చికెన్‌ పేరిట హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రకాలైన శాకాహార వంటకాలను అభిమానులతో కలిసి ఆరగించారు.

ఒక మంచి పాటపాడితే ఎంత చక్కటి అనుభూతి కలుగుతుందో... రుచికరమైన వంటకాలను ఆరగిస్తే అలాంటి అనుభూతే కలుగుతుందని సునిత అన్నారు. రెస్టారెంట్‌కు చిన్నారి చికెన్‌ అనే పేరు చాలా బాగుందని తెలిపారు. ఫ్యామిలీతో కలిసి విందు భోజనం చేయాలంటే చిన్నారి చికెన్‌కు రావాలన్నారు. ఈ సందర్భంగా ఆహా ఏమి రుచి అనే పాటపాడి అలరించారు.

చక్కటి శాకాహార భోజనం అంటే చాలా ఇష్టం: సింగర్‌ సునిత

ఇదీ చదవండి:'జాతీయ జెండా ఉన్న కేకు తింటే నేరం కాదు'

ABOUT THE AUTHOR

...view details