ప్రముఖ గాయని పి.సుశీలను ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా సత్కరించారు. స్థానిక ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, కాస్మో పాలిటన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజులు... గాన కోకిలకు సన్మానం చేశారు. తాను తెలిగింటి ఆడపడుచునని... తెలుగు ఎంతో ప్రత్యేకమైనదని, మాధుర్యమైనదని సుశీల కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ఆమె ఆలపించిన గీతాలు ఆహుతులను అలరించాయి.
గానకోకిల సుశీలకు ఘన సత్కారం - భీమవరంలో సింగర్ పి. సుశీల
తెలుగు... తేనెలొలుకు భాష అని గాయని పి.సుశీల అన్నారు. భీమవరంలో గాన కోకిలను ఘనంగా సత్కరించారు. ఆమె పాటలు పాడి ఆహుతులను మంత్ర ముగ్ధులు చేశారు.
గానకోకిల సుశీలకు ఘన సత్కారం