తన పాటతోనే కాదు.. మాటతోనూ అభిమానులను సంపాదించుకుంది గాయని చిన్మయి శ్రీపాద. అనేక సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడి ఆకట్టుకున్న చిన్మయి.... పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్తోంది. మీటూ ఉద్యమంతో తనపై జరిగిన అకృత్యాల గురించి మాట్లాడి, మహిళలందరూ మాట్లాడాలని కోరిన మొట్టమొదటి గాయని కూడా ఆమే. మరి చిన్మయి మహిళా సాధికారత.. సమానత్వం గురించి ఏం చెబుతోందో... ఆమె మాటల్లోనే విందాం.
మహిళా సాధికారతపై గాయని చిన్మయి ఏమన్నారంటే? - మహిళల గురించి సింగర్ చిన్మయి శ్రీపాద వ్యాఖ్యలు
మహిళలు ఆర్థిక సమానత్వాన్ని కల్గి ఉండాలని, వారికేం ఇబ్బంది వచ్చినా ఎటువంటి బిడియం, భయం లేకుండా అందిరి ముందు చెప్పగలగాలనే తాను మీటూ ఉద్యమంలో తనపై జరిగిన అకృత్యాల గురించి మాట్లాడినట్లు తెలిపారు గాయని చిన్మయి శ్రీపాద.
![మహిళా సాధికారతపై గాయని చిన్మయి ఏమన్నారంటే? singer chinmai sripada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6165370-544-6165370-1582367939986.jpg)
'మహిళలు తమకు ఏ ఇబ్బంది వచ్చినా చెప్పగలగాలి'
'మహిళలు తమకు ఏ ఇబ్బంది వచ్చినా చెప్పగలగాలి'