తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి కార్మికులకు శుభవార్త... దసరా వేళ బోనస్ కానుక​ - బొగ్గుగని కార్మికులకు బోనస్​

సింగరేణి కార్మికులకు ఈనెల 23న బోనస్ చెల్లించనున్నట్టు సీఎండీ శ్రీధర్ తెలిపారు. బోనస్​తో పాటు మార్చి నెలలో మినహాయించిన జీతం కూడా చెల్లించనున్నట్టు వెల్లడించారు.

సింగరేణి కార్మికులకు శుభవార్త... దసరా వేళ భారీగా బోనస్​
సింగరేణి కార్మికులకు శుభవార్త... దసరా వేళ భారీగా బోనస్​

By

Published : Oct 13, 2020, 5:25 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు సింగరేణి లాభాల్లో 28 శాతాన్ని కార్మికులకు బోనస్​గా చెల్లించనున్నట్లు సీఎండీ శ్రీధర్​ తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 993 కోట్ల 86 లక్షల రూపాయల నికర లాభాలు రాగా.. అందులో 278 కోట్ల 28 లక్షల రూపాయలను బోనస్​గా చెల్లిస్తామన్నారు.

ఒక్కో కార్మికునికి 60వేల 468 రూపాయల బోనస్‌ వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో మార్చినెలలో కోత విధించిన జీతాన్ని కూడా బోనస్​​తో కలిపి ఈనెల 23 కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సీఎండీ వెల్లడించారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా దసరా పండుగ సందర్భంగా ఒక్కొక్కరికి అడ్వాన్సుగా ఇస్తున్న 25 వేల రూపాయలను అదే రోజున ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:యాసంగి పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details