సింగరేణిలో రెండో దశలో చేపట్టిన 90 మెగావాట్ల సౌర ప్లాంట్లలో మందమర్రి ప్లాంటు-2 నుంచి 15 మెగావాట్ల విభాగాన్ని గురువారం ట్రాన్స్‌కోకు అనుసంధానించారు. ఇప్పటికే తొలిదశ కింద మణుగూరులో 30 మెగావాట్లు, రామగుండం 30, ఇల్లందు 39, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 10 మెగావాట్ల ప్లాంట్లను అనుసంధానం చేశారు. మందమర్రి ప్లాంటుతో కలిపితే మొత్తం 124 మెగావాట్ల సౌర విద్యుత్ ట్రాన్స్‌కోకు అనుసంధానమైంది. రెండో దశలో మిగిలిన 75 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాలను మే నెలాఖరుకు, మూడో దశలో 80.5 మెగావాట్ల ప్లాంట్లను అక్టోబరుకల్లా పూర్తిచేయాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
రెండో దశలో మొత్తం మూడుచోట్ల సౌర ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. మొత్తం 90 మెగావాట్లలో మిగిలిన మందమర్రి ప్లాంటు-1లో 28 మెగావాట్లు, కొత్తగూడెంలో 37 మెగావాట్లు, భూపాలపల్లిలో 10 మెగావాట్ల ప్లాంట్లను చేపడతారు. వీటి నిర్మాణ కాంట్రాక్టును అదానీ గ్రూపు దక్కించుకుంది.
124 మెగావాట్లకు చేరిన సింగరేణి సౌరవిద్యుత్తు - telangana varthalu
సింగరేణి సంస్థలో రెండో దశలో చేపట్టిన సౌర ప్లాంట్లలో మందమర్రి ప్లాంటు-2 నుంచి 15 మెగా వాట్ల విభాగాన్ని ట్రాన్స్‌కోకు అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు మొత్తం 124 మెగావాట్ల సౌర విద్యుత్ ట్రాన్స్‌కోకు అనుసంధానమైంది.
124 మెగావాట్లకు చేరిన సింగరేణి సౌరవిద్యుత్తు