తెలంగాణలో నాలుగు బొగ్గు బ్లాక్‌లను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సహా ఐదు జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, బీఎంఎస్‌లు ఇచ్చిన సమ్మె నోటీసుపై ఇవాళ సింగరేణి యాజమాన్యం ఆయా కార్మిక సంఘాల నాయకులతో సుదీర్ఘంగా ప్రత్యేక చర్చలు జరిపింది. దేశంలో బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులో స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులపై కూలంకషంగా కార్మిక సంఘాల నాయకులకు యాజమాన్యం వివరించింది. అలాగే నాలుగు బ్లాక్‌లను వేలానికి వెళ్లకుండా చూసేందుకు యాజమాన్యం శక్తివంచన లేకుండా చివరి వరకూ చేసిన ప్రయత్నాలను తెలియజేసింది. కేంద్రానికి సంస్థ తరఫున లేఖ రాయడమే కాకుండా, ఆ బ్లాక్‌లలో తాము చేపట్టిన అన్వేషణ పనులను వివరించామని తెలిపింది. అలాగే బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా ప్రధాన మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం వివరించింది.
సమ్మె వల్ల ఉపయోగం ఉండదు: యాజమాన్యం
బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ దేశవ్యాప్త విధానపరమైన నిర్ణయం నేపథ్యంలో తెలంగాణలో నాలుగు బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తున్నారని, ఇది ఒక్క సింగరేణికో, తెలంగాణ రాష్ట్రానికో సంబంధించింది కాదని, ఇక్కడ సమ్మె చేయడం అనేది సమస్య పరిష్కారానికి ఉపయోగకరం కాదని సింగరేణి యాజమాన్యం పేర్కొంది. అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థకు నష్టం జరగడం తప్ప ఉపయోగం ఉండదని, ఉత్పత్తికి విఘాతం కాని వేరే పద్ధతుల్లో మన సమస్యను పరిష్కరించుకోవచ్చని యాజమాన్యం కార్మిక సంఘాల నాయకులకు వివరించింది. నాలుగు బ్లాక్‌ల వేలంతో సింగరేణి మనుగడకే ప్రమాదమని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.
సింగరేణి మనుగడకే ప్రమాదం: కార్మిక సంఘాలు