కరోనా నివారణ చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 40 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రగతి భవన్లో సీఎం కే చంద్రశేఖర్ రావును కలిసి రూ.40 కోట్ల చెక్కును అందచేశారు.
లలిత జ్యువెల్లరీస్ రూ.కోటి విరాళం
లలిత జ్యువెల్లరీస్ సీఎండీ ఎం.కిరణ్ కుమార్ సైతం సీఎం కేసీఆర్ను కలిసి కోటి రూపాయల చెక్కును విరాళంగా అందించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు కోటి రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్, లలిత జ్యువెల్లరీస్కు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవీ చూడండి : సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ మందుబాబు ఆనందం