తెలంగాణ

telangana

ETV Bharat / state

Singareni CMD on Safety: ఖర్చుకు వెనుకాడవద్దు.. కార్మికుల ప్రాణాలే ముఖ్యం: శ్రీధర్ - సింగరేణి వార్తలు

సింగరేణిలో భద్రత చర్యలపై సీఎండీ శ్రీధర్ (singareni CMD review on safety) ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఖర్చుకు వెనకాడవద్దని..కార్మికుల ప్రాణాలే (safety measures in singareni) ముఖ్యమని అధికారులకు సూచించారు. రక్షణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Singareni Cmd Sridhar on Safety
సింగరేణిలో భద్రత చర్యలపై సీఎండీ శ్రీధర్ సమీక్ష

By

Published : Nov 22, 2021, 10:46 PM IST

సింగరేణిలో ప్రతి గని, విభాగంలో రక్షణ పెంపుదలకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఏరియా జనరల్‌ మేనేజర్లకు సీఎండీ శ్రీధర్‌ (Singareni CMD on safety in mines) స్పష్టం చేశారు. సింగరేణిలో ఇటీవల ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో భద్రత చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఖర్చుకు వెనకాడవద్దని.. కార్మికుల ప్రాణాలే(singareni workers) సంస్థకు ముఖ్యమని చెప్పారు. ఇవాళ హైదరాబాద్​లోని సింగరేణి భవన్‌ నుంచి డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లతో సీఎండీ ప్రత్యేకంగా దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

రక్షణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచన

రక్షణపై కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని.. భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎండీ శ్రీధర్ (Sinagreni CMD Sridhar) హెచ్చరించారు. ఇటీవల జరిగిన ప్రమాదాలలో నలుగురు కార్మికులు, ఒక అధికారి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. బొగ్గు ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాలు, వారి భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. కార్మికుల రక్షణకు(workers safety measures in coal mines) అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గని అధికారులదేనన్నారు. ఈ విషయంలో అవసరమైన వారికి శిక్షణలు ఇవ్వాలని సూచించారు. రక్షణకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని జీఎంలను కోరారు. భారీ యంత్రాల రక్షణకు కూడా తగు చర్యలు తీసుకోవాలన్నారు. రక్షణ చర్యలు పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. చిన్నా, పెద్దా ఉద్యోగి అనే తేడా లేకుండా బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

మార్చి నాటికి లక్ష్యం సాధించాలి

ఈ సందర్భంగా నవంబర్‌ నెలలో ఇప్పటి వరకూ సాధించిన బొగ్గు ఉత్పత్తి(singareni coal production), బొగ్గు రవాణాపై సీఎండీ సమీక్షించారు. ఇటీవలి వర్షాల వలన బొగ్గు ఉత్పత్తికి కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ ఇంకా మిగిలిన రోజుల్లో రోజుకి 2.10 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 14 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డన్ తొలగించాలని అధికారులకు నిర్దేశించారు. అన్ని ఏరియాల వారు తమకు కేటాయించిన లక్ష్యాలు సాధించాలని వివరించారు. వచ్చే మార్చి నెలాఖరుకు 680 లక్షల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యాన్ని నిర్దేశించారు. భూసేకరణ, ఆర్‌అండ్ఆర్‌ సమస్యలను జిల్లా ప్రభుత్వ అధికారుల సహాయంతో పరిష్కరించుకోవాలని శ్రీధర్ సూచించారు.

సింగరేణి బొగ్గు గనుల్లో ఇటీవల జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు (singareni accident)మృతి చెందారు. బొగ్గు గనుల్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలని సీఎండీ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్మికుల రక్షణ కోసం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు సీఎండీ శ్రీధర్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి;

Singareni: సింగరేణి గనిలో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు దుర్మరణం

శ్రీరాంపూర్​ ప్రమాద బాధితులను ఆదుకుంటాం:సింగరేణి సీఎండీ

ABOUT THE AUTHOR

...view details