తెలంగాణ

telangana

ETV Bharat / state

'సోలార్​ ప్లాంట్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి' - telangana varthalu

సింగరేణి నిర్మిస్తోన్న సోలార్​ ప్లాంట్ల నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలని సంస్థ సీఎండీ శ్రీధర్...​ అధికారులను, కాంట్రాక్ట్​ ఏజెన్సీలను ఆదేశించారు. మొత్తం 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను సెప్టెంబర్​ నాటికి ట్రాన్స్​కోకు అనుసంధానం చేయాలని సూచించారు.

'సోలార్​ ప్లాంట్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి'
'సోలార్​ ప్లాంట్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి'

By

Published : Feb 24, 2021, 9:25 PM IST

సింగరేణి సంస్థ నిర్మిస్తోన్న 300 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లలో మొదటి, రెండవ దశలోని 219 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్​ల నిర్మాణాలు మొత్తం ఏప్రిల్ చివరికి పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్​... అధికారులను, కాంట్రాక్ట్​ ఏజెన్సీలను ఆదేశించారు. 3వ దశలోని 81 మెగావాట్ల నిర్మాణం సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేసి... మొత్తం 300 మెగావాట్ల సింగరేణి సోలార్‌ విద్యుత్తును రాష్ట్ర ట్రాన్స్‌ కోకు అనుసంధానం చేయాలన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్​లో సోలార్‌ విభాగం అధికారులు, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాంట్రాక్టు ఏజెన్సీలో సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ కరీంనగర్‌ సమీపంలోని మానేరు డ్యాంపై నిర్మించతలపెట్టిన 350 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్​ పురోగతిపై ఆరా తీశారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న 300 మెగావాట్ల సౌర విద్యుత్​లో.... మొదటి దశలో ఇప్పటికే 85 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయి, విద్యుత్తు ఉత్పత్తి మొదలు కాగా దీనిని ట్రాన్స్‌ కోకు అనుసంధానం చేశారు.

మొదటి దశలో మిగిలి ఉన్న ఇల్లందులోని 24 మెగావాట్లు వారంలోపు, రామగుండంలోని 20 మెగావాట్ల నిర్మాణం మార్చి నెలాఖరు కల్లా పూర్తి చేసి విద్యుత్తును అనుసంధానం చేయాలని సీఎండీ ఆదేశించారు. రెండో దశలో నిర్మించతలపెట్టిన మొత్తం 90 మెగావాట్ల ప్లాంట్​లో...మందమర్రి ప్రాంతంలో 43 మెగావాట్లు, కొత్తగూడెం ప్రాంతంలో 37 మెగావాట్లు, భూపాలపల్లి ప్రాంతంలో 10 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు సీఎండీ తెలిపారు.

3వ దశలో నిర్మించతలపెట్టిన మొత్తం 81 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లలో నీటిపై తేలియాడే 15 మెగావాట్ల ప్లాంట్​ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, మరో 7 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని... అలాగే రామగుండం-3 లోని ఓ.బి. డంపులపై నిర్మించే 22 మెగావాట్ల ప్లాంట్​, డోర్లీ ఓ.బి. డంపులపై నిర్మించే 10 మెగావాట్ల ప్లాంట్​, చెన్నూరులో నిర్మించే 11 మెగావాట్లు, కొత్తగూడెం ఏరియాలోని ఖాళీ ప్రదేశాల్లో నిర్మించే 23 మెగావాట్ల నిర్మాణాలను కూడా ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు.

ఇదీ చదవండి: సరదాగా కాసేపు: విద్యార్థుల ప్రావీణ్యాన్ని పరీక్షించిన మంత్రి హరీశ్​

ABOUT THE AUTHOR

...view details