పొరుగు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఉన్నందున సింగరేణిలో ఉత్పత్తి పెంచాలని సంస్థ సీఎండీ శ్రీధర్(Singareni CMD Sridhar ) ఆదేశించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో రెండు మూడు రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల డిమాండ్‌కు అనుగుణంగా లక్ష్యాలకు మించి ఉత్పత్తి, రవాణా పెంచాలని సూచించారు. విదేశీ బొగ్గు ధర 100 శాతానికి పైగా పెరగడంతో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు స్పాంజ్, ఐరన్, సిమెంట్ పరిశ్రమలు నేడు స్వదేశీ బొగ్గు వైపు చూస్తున్నాయని వివరించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉత్పత్తి, రవాణా పెంచాలని కోరుతోందని జనరల్ మేనేజర్లకు ఆయన వివరించారు. రోజుకు కనీసం 1.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే పరిమాణంలో రవాణా చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Singareni coal: పొరుగు రాష్ట్రాల్లో కొరత.. ఉత్పత్తి పెంచాలన్న సీఎండీ - బొగ్గు ఉత్పత్తిపై సమీక్ష
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా పెంచాలని సీఎండీ శ్రీధర్(Singareni CMD Sridhar ) ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. లక్ష్యాలకు మించి ఉత్పత్తి, సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.
![Singareni coal: పొరుగు రాష్ట్రాల్లో కొరత.. ఉత్పత్తి పెంచాలన్న సీఎండీ Singareni coal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13261966-191-13261966-1633383295570.jpg)
సింగరేణితో ఒప్పందం ఉన్న తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం నుంచి 10 రోజుల వరకు బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత ఉన్నందున నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను దాటి బొగ్గు రవాణా చేయాల్సిన అవసరం ఉందని సీఎండీ శ్రీధర్ స్పష్టం చేశారు. గడచిన ఆరు నెలల కాలంలో సింగరేణి గతేడాది కన్నా గణనీయమైన వృద్ధిని సాధించిందని వెల్లడించారు. మిగిలిన ఆరు నెలలు కూడా ఇదే ఒరవడితో పనిచేస్తూ లక్ష్యాలను మించి ఉత్పత్తి, రవాణా సాధించాలని కోరారు. ఇప్పుడు వర్షాలు పూర్తిగా తగ్గు ముఖం పట్టినందున 13 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలని సీఎండీ ఆదేశించారు. ఇకపై ఏరియాల జనరల్ మేనేజర్లు బొగ్గు ఉత్పత్తి, రవాణాపైనే పూర్తి దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:Power generation in Telangana : విద్యుదుత్పత్తిలో తెలంగాణ, సింగరేణి టాప్