తెలంగాణ

telangana

ETV Bharat / state

మూగజీవాల సంరక్షణే లక్ష్యం.. వాటి కోసం ఇక్కడే ఉండిపోతా.: డాక్టర్​.సింధూర - sindhura pothineni feeding street dogs and birds

Animal Lover Sindhura Pothineni: ఆ యువతి వృత్తి రీత్యా వైద్యురాలు.. ప్రవృత్తి రీత్యా మూగ జీవాల నేస్తం. శునకాల ఆకలి, దప్పికలు తీర్చడమంటే ఆమెకు ఎంతో ఇష్టం. పక్షుల బాగోగులు చూస్తూ..వాటితో ముచ్చటించడం అంటే చెప్పలేనంత ప్రేమ. పక్షులు ప్రమాదానికి గురైతే.. చేరదీసి చికిత్స అందించడం ఆమె అలవాటు. ఇలా... మూగజీవాల సంరక్షణ కోసం కృషి చేస్తున్న తనే... హైదరాబాద్‌కు చెందిన డా.సింధూర.

Animal Lover Sindhura Pothineni
సింధూర పోతినేని

By

Published : Jan 13, 2022, 3:50 PM IST

మూగజీవాలను సంరక్షిస్తున్న డా. సింధూర

Animal Lover Sindhura Pothineni: సింధూర పోతినేనికి మూగజీవాలంటే అమితమైన ప్రేమ. అవి ఆకలితో ఉన్నా.. దెబ్బలతో బాధపడినా తల్లడిల్లిపోతుంది. అనునిత్యం వాటి సంరక్షణకు పాటుపడుతూనే ఉంటుంది. హైదరాబాద్‌ కొత్తపేటకు చెందిన ఈమె... ప్రమాదాల బారినపడిన జంతువులకు కొత్త జీవితాన్ని అందిస్తోంది. జంట నగరాల్లో మూగ జీవాలపై ఆదరణ కొరవడుతున్న తరుణంలో వాటికి రక్షణ కల్పించటమే అలవాటుగా మార్చుకుంది.

మూగజీవాల పాలిట వరంగా

ప్రధానంగా సింధుర.. వీధి కుక్కల బాగోగులు చూస్తుంది. ఆ క్రమంలో... తనలాంటి అభిరుచి గల శ్రీవిద్య అనే గృహిణి సింధూరకు పరిచయమయ్యారు. ఐదేళ్ల క్రితం మెుదలైన వీరి స్నేహం... మూగజీవాల పాలిట వరంగా మారింది. ఆర్థిక భారమైనా సరే ఈ ఇద్దరూ కలిసి రోజు వందకు పైగా కుక్కులకు భోజనం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 350 పైగా శునకాలను కాపాడింది. 250 పైగా శునకాలకు టీకా వేయించింది.

శునకాలకు సమయానికి ఆహారం, నీళ్లు అందిస్తే వాటి కోపం తగ్గుతుంది. వాటిని మచ్చిక చేసుకుని ఉదయం, సాయంత్రం ఆహారం అందిస్తాం. వీధి కుక్కల సంతతి పెరగకుండా వాటికి ఆపరేషన్​ చేయిస్తున్నాను. తద్వారా వాటికి, సొసైటీకి మేలు జరుగుతుంది. అంతేకాకుండా నేను వ్యక్తిగతంగా పక్షుల సంరక్షణ కూడా చూస్తున్నాను. ఇప్పటివరకు 150 పక్షులను కాపాడాను.

-డా. సింధూర పోతినేని, జంతు ప్రేమికురాలు

పక్షులకు పునరావాసం

జంతువులే కాదు.. పక్షుల సంరక్షణకు సింధూర తనవంతు సహకారం అందిస్తోంది. వేసవి కాలంలో నీరు దొరకక ఇబ్బంది పడే పక్షుల కోసం...ఏదో ఒకటి చేయాలని పక్షుల జీవనశైలిపై అధ్యయనం చేసింది. తెలిసిన ఆర్నిథాలజిస్ట్ సూచనలతో పక్షులకు పునరావాసం ఏర్పాటు చేసింది. అలా.. ఇప్పటివరకు 120 పైగా పక్షులను కాపాడి.. వాటికి మళ్లీ స్వేచ్ఛనిచ్చింది.

ఇంట్లోనే అన్ని ఏర్పాట్లకు

డాక్టర్ సింధూర... స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లా. ఉద్యోగరీత్యా వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. 2018లో బీడీఎస్ పూర్తి చేసిన యువతి... ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తోంది. చిన్నగా మెుదలైన ఈ ప్రయాణంలో.. భారీ స్థాయిలో జంతువుల సంరక్షణ బాధ్యతలు చేపట్టేందుకు ఇంట్లోనే అత్యాధునిక ఇంకుబేటర్లు, ఎక్విప్‌మెంట్‌, కేజెస్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం నేను ఎండీఎస్​కు ప్రిపేర్​ అవుతున్నాను. నాకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే ఆలోచన లేదు. ఇక్కడే చదువుకోవాలనుకుంది. ఎందుకంటే హైదరాబాద్​లో సీట్​ వస్తే వీధి కుక్కలు, పక్షుల సంరక్షణ చూసుకోగలను. వీటి సంరక్షణకు కొంత మేర నిధులు అవసరం. -డా. సింధూర పోతినేని, జంతు ప్రేమికురాలు

లాక్​డౌన్​లో ఆత్మీయుల్లా

వీరిద్దరు లాక్‌డౌన్‌ సమయంలో తమ సేవల్ని మరింత విస్తృతం చేశారు. దిల్‌సుఖ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో కుటుంబాలు వదిలేసిన ఎన్నో శునకాల ఆకలి, దప్పికలు తీర్చారు. ఒక్కో రోజు 200 కుక్కలకు భోజనం పెట్టిన సందర్భాలూ ఉన్నాయి.

ఐదేళ్లుగా సింధూరతో కలిసి శునకాల సంరక్షణ చూస్తున్నాను. వాటికి రోజూ ఉదయం, సాయంత్రం భోజనం పెడతాము. లాక్​డౌన్​ సమయంలో రోజుకు 200 వీధి శునకాల ఆకలి తీర్చాము. వాటికి మీరు అన్నం పెట్టకపోయినా పర్లేదు. కానీ కొట్టాలని, చంపాలని మాత్రం ప్రయత్నించకండి. ---శ్రీవిద్య, జంతు ప్రేమికురాలు

ప్లాస్టిక్​ మాంజా వద్దు

మెుదట్లో వీధి కుక్కలు అంటే భయంగా ఉండేది కానీ, కుమార్తె చొరవతో... వాటి బాగోగులు చూడటం తమకు అలవాటైందని సింధూర తల్లిదండ్రులు చెబుతున్నారు. దిక్కుమెుక్కు లేని ఆ మూగజీవాల ఆకలి తీర్చడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. సంక్రాతి సందర్భంగా చిన్న పెద్దా అంతా... గాలిపటాలు ఎగురవేస్తుంటారు. ఐతే చాలా మంది ప్రస్తుతం.. ప్లాస్టిక్‌ మాంజాలు ఉపయోగిస్తున్నారు. ఇవి పక్షుల ప్రాణాలకు ముప్పు కలుగజేస్తాయని చెబుతోంది సింధూర.

ప్లాస్టిక్​ మాంజా వాడితే పక్షుల ప్రాణాలు పోయే అవాకాశం ఉంది. అందుకే దారాన్ని వినియోగించండి. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఇప్పటివరకు కొన్ని వందల పక్షులను కాపాడాం. స్వేచ్ఛగా ఎగిరే పక్షులను ఎగరనివ్వండి. జంతు ప్రేమికులెవరైనా స్వచ్ఛందంగా విరాళాలు ఉందిస్తే వాటి కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేయగలను.

---డా. సింధూర పోతినేని, జంతు ప్రేమికురాలు

ఎంతో ఇష్టంగా మెుదలైన ఈ సేవా కార్యక్రమంలో భారీ స్థాయిలో మూగజీవాల బాగోగులు చూడటానికి ఆర్థిక సహకారం అవసరం. జంతు ప్రేమికులు ఎవరైనా స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తే... జంతువుల రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని సింధూర చెబుతోంది.

ఇదీ చదవండి:'ఊళ్లోకి వైరస్​ను తీసుకెళ్లకండి.. జాగ్రత్తలు తీసుకుంటేనే నిజమైన పండుగ'

ABOUT THE AUTHOR

...view details