విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు కోడలు సింధు శర్మ హైకోర్టును ఆశ్రయించారు. పెద్ద కుమార్తెను తనకు అప్పగించాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణ చేపట్టిన ధర్మాసనం రేపు రిషిత, ఆమె తల్లిదండ్రులను తమ ఎదుట హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది.
భర్త తనను వేధిస్తున్నాడని ఇటీవల ఫిర్యాదు చేసిన సింధు శర్మ.. తన ఇద్దరు పిల్లల కోసం ఆదివారం ఇంటి ముందు ధర్నాకు దిగింది. అదేరోజు చిన్నకూతురును అప్పగించిన భర్త.. పెద్దకూతురు రిషితను తన వద్దే ఉంచుకున్నాడు. దీనిపై భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ జరిగినా.. భర్త వినలేదు. చివరకు మూడున్నర ఏళ్లు ఉన్న తన పెద్ద కూతురును అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించింది.
పెద్దకుమార్తె కోసం హైకోర్టులో సింధుశర్మ పిటిషన్
జస్టిస్ నూతి రామ్మోహనరావు కోడలు సింధుశర్మ హైకోర్టును ఆశ్రయించారు. పెద్ద కుమార్తె రిషితను తనకు అప్పగించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.
సింధు శర్మ
ఇదీ చదవండి : హైకోర్టులో మల్లన్నసాగర్ నిర్వాసితుల పిటిషన్