తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడి - National BC Welfare Association President R. Krishnaiah Latest News

నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. గురుకులాల ప్రిన్సిపల్‌ నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ.. ఆందోళన చేపట్టారు. స్పందించకుంటే సెక్రటేరియట్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు.

నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి
నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి

By

Published : Feb 22, 2021, 4:52 PM IST

టీఎస్​పీఎస్సీ ఓ రబ్బరు స్టాంపు కమిషన్‌లా తయారైందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గురుకులాల పిన్సిపల్ నియామకాలు వెంటనే చేపట్టాలంటూ... అభ్యర్థులతో కలిసి నాంపల్లిలోని టీఎస్​పీఎస్సీ కార్యాలయాన్ని నిరుద్యోగ జేఏసీ ముట్టడించింది. వారికి మద్దతుగా ఆర్ కృష్ణయ్య ఆందోళన చేపట్టారు.

నాణ్యమైన విద్యను అందించే గురుకులాలకు ప్రధానోపాధ్యాయులను నియమించకుండా... నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. గురుకులాల అభ్యర్థుల్లో ఇప్పటికే ఏడుగురు చనిపోయారని... మరి కొందరు ఉపాధి లేక రోడ్డున పడ్డారని తెలిపారు. రెండు రోజుల్లో స్పందించకపోతే వేలాది మందితో సెక్రటేరియట్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి

ఇదీ చూడండి:హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

ABOUT THE AUTHOR

...view details