సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పాలని భావిస్తున్న మహిళలను సిడ్బీ(భారతీయ లఘు పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు) ప్రోత్సాహకాలు అందిస్తోంది. పలు ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి ఉచిత స్టాళ్ల ఏర్పాట్లను చేస్తోంది. అయితే నిర్వాహకుల్లో నైపుణ్యం కోసం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. వారిలో నైపుణ్యాలు పెంచే విధంగా కృషి చేస్తూనే మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తోంది. అయితే ఇటీవల జరిగిన నాంపల్లి నుమాయిష్లో 14 స్టాళ్లను ఏర్పాటు చేసి సుమారు రూ. 20లక్షల వరకు సిడ్బీ వెచ్చించింది.
అలాగే గతేడాది జరిగిన సరస్ ఫెయిర్-2022లోనూ షాపులను ఏర్పాటు చేసింది. ఈ రెండు ప్రదర్శనల్లో సుమారు 100 మందికి అవకాశం కల్పించగా.. 1900 మంది మహిళలకు బ్యాంక్ అండగా నిలిచింది. చెక్కబొమ్మలు, లెదర్ బ్యాగులు, బయో ఉత్పత్తులు, చేతివృత్తులు తదితర తయారీ యూనిట్లు సుమారు 150కి పైగా సిడ్జీ పరిశీలనలోనే ఉన్నాయి. వీటి ఏర్పాటుకు సుమారు రూ.10లక్షల నుంచి రూ.80లక్షల వరకూ ఖర్చవుతుందని సిడ్బీ అంచనా వేస్తోంది. ఇవి నెలకొల్పడానికి.. బయట బ్యాంకు రుణాలు పొందేందుకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయని యాజమాన్యం తెలిపింది. కానీ ఇలాంటి వారికి సిడ్బీ మార్గదర్శకంగా నిలుస్తోంది.