తెలంగాణ

telangana

By

Published : Jul 19, 2020, 7:41 PM IST

Updated : Jul 19, 2020, 10:20 PM IST

ETV Bharat / state

అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత

bSick of Devineni Sitaramaiah's diedreaking
breakiఅనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూతng

19:40 July 19

అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత

తొలితరం చార్టెడ్ అకౌంటెంట్, ప్రముఖ ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కంపెనీ సీనియర్ భాగస్వామి, పలు సంస్థలకు డైరక్టర్​గా వ్యవహరించిన దేవినేని సీతారామయ్య కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా కిందటి ఆదివారం అపోలో ఆస్పత్రిలో చేరిన దేవినేని సీతారామయ్య.. ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రేపు ఉదయం ఏడు గంటలకు అపోలో ఆస్పత్రి నుంచి ఆయన పార్థివ దేహాన్ని జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎప్పుడూ ముందుండే వ్యక్తి

సీతారామయ్యకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో వైద్యులు.. కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారు. దేవినేని సీతారామయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు గ్రామం. కంకిపాడు మండలం పునాదిపాడులో సీతారామయ్య పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. గుంటూరులో బీకాం, సీఏ పూర్తి చేసిని సీతారామయ్య అనేక ఉన్నత పదవుల్లో కొనసాగారు. తితిదే ఛైర్మన్‌గా, హెరిటేజ్‌ ఫుడ్‌ ఛైర్మన్‌గా, బాచుపల్లి విజ్ఞానజ్యోతి చారిటీ సంస్థ వ్యవస్థాపక కోశాధికారిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక సంస్థ డైరెక్టర్‌గా పని చేశారు. దుండిగల్‌ సేవా ఆశ్రమం వృద్ధాశ్రమానికి ఛైర్మన్‌గా ఉన్నారు.పలు కంపెనీలకు ఛైర్మన్‌గా, డైరెక్టర్‌గా పని చేశారు. థార్మిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండేవారు.

చంద్రబాబు సంతాపం

దేవినేని సీతారామయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. సీతారామయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్టీఆర్‌కు దేవినేని సీతారామయ్య అత్యంత సన్నిహితులని తెలిపిన చంద్రబాబు.. తితిదే ఛైర్మన్‌గా సీతారామయ్య అందించిన సేవలను కొనియాడారు.

ఇదీ చూడండి :ఆషాఢం చివరి ఆదివారం బోనాల ఉత్సవాలు చుద్దామా.!

Last Updated : Jul 19, 2020, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details