Hyderabad SI Rajendra Drugs Case Update :రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు(Drug Case)లో అరెస్ట్ అయిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్సై రాజేంద్ర(SI Rajendra)ను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కూకట్పల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. పోలీసులు వారం రోజులు అడగగా రెండు రోజులు కస్టడీకి అనుమతి ఇచ్చింది. మాదకద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్న ఎస్సై రాజేంద్రను రాయదుర్గం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 1700 గ్రాముల మాదకద్రవ్యాలు విక్రయించేందుకు ప్రయత్నించిన విషయాలను.. పోలీసులు నిందితుడి నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలు విక్రయించేందుకు ఎవరెవరిని సంప్రదించారనే వివరాలను సేకరిస్తున్నారు. ఎస్సైని ప్రశ్నిస్తున్న పోలీసులు అతని నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
Kukatpally Court judgment onSI Rajendra Drugs Case :ఎస్సై రాజేంద్రను ప్రశ్నించేందుకు కూకట్పల్లి కోర్టుకు 2రోజుల కస్టడీకి అనుమతించింది. వారం రోజుల కస్టడీ కావాలని పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎస్సై రాజేంద్ర నైజీరియన్ నుంచి స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను తన ఇంట్లో దాచిపెట్టుకున్నట్లు గుర్తించామని.. విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్చేసినట్లు పీపీ కోర్టుకు తెలిపారు. ముంబయిలో నిందితుడి నుంచి తీసుకున్న డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు ఎలా తీసుకొచ్చాడు.. ఎవరికి విక్రయించేందుకు ప్రయత్నించాడనే విషయాలను తెలుసుకోవాల్సి ఉందని.. దీనికోసం వారం రోజుల కస్టడీ ఇవ్వాలని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న కూకట్పల్లి కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించింది. సోమవారం రాజేంద్రను రాయదుర్గం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ ముగిసిన తర్వాత పోలీసులు రాజేంద్రను కోర్టులో హాజరుపర్చనున్నారు.
Hyderabad SI Rajendra Drugs Case Update : డ్రగ్స్ కేసు అప్డేట్.. SI రాజేంద్ర కాల్‌డేటాలో అసలుగుట్టు