ఉరేసుకుని సీఆర్‌పీఎఫ్ ఎస్సై ఆత్మహత్య - హైదరాబాద్ సీఆర్పీఎఫ్ క్వార్టర్స్‌లో ఎస్సై ఆత్మహత్య
![ఉరేసుకుని సీఆర్‌పీఎఫ్ ఎస్సై ఆత్మహత్య si-attempt-suicide-in-jubli hills-crpf-quarters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6462263-225-6462263-1584597375601.jpg)
ఉరేసుకుని సీఆర్‌పీఎఫ్ ఎస్సై ఆత్మహత్య
09:47 March 19
జూబ్లీహిల్స్ సీఆర్‌పీఎఫ్ క్వార్టర్స్‌లో ఎస్సై ఆత్మహత్య
హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఆర్‌పీఎఫ్ క్వార్టర్స్‌లో ఓ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్వార్టర్స్‌లోని వినోద గదిలో రాజస్థాన్‌కు చెందిన భవానీ శంకర్ ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. గమనించిన సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Mar 19, 2020, 11:46 AM IST