తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటైన్మెంట్ ఏరియాలో దురుసుగా ప్రవర్తించిన ఎస్సై - చిన్నారికి గాయాలు

కంటైన్మెంట్ ఏరియా నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదనే నిబంధన ఉన్నా... కూతురి పాల కోసం వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఎస్సై అమానుషంగా వ్యవహరించాడని... అతని వల్లే తన కూతురికి గాయాలయ్యాయని శేఖర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

si-abhishek-rude-behavior-in-contentment-area-at-jiyaguda
కంటైన్మెంట్ ఏరియాలో దురుసుగా ప్రవర్తించిన ఎస్సై

By

Published : May 21, 2020, 5:36 PM IST

హైదరాబాద్​లోని జియాగూడలో కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన ఇందిరానగర్​లో నివాసముంటున్న శేఖర్​పై ఎస్సై అమానుషంగా వ్యవహరించారంటూ బాధితులు ఆరోపించారు. కంటైన్మెంట్ ప్రాంతంలో పోలీసులు కాపలా ఉండాల్సింది పోయి... స్థానికంగా ఉండే రాజు అనే వ్యక్తికి బారికేడ్ గేటు తాళాలు ఇచ్చారు. కుమార్తెకు పాల కోసం శేఖర్ బారికేడ్ల వద్దకు రాగా... తాళాలు తీయమంటే రాజు ససేమిరా అన్నాడు. శేఖర్ బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో... అక్కడే ఉంటున్న మరో నివాసి అభ్యంతరం తెలిపాడు.

ఈ నేపథ్యంలో అతనికి, శేఖర్‌కు మధ్య గొడవైంది. ఈ తతంగాన్ని రాజు చరవాణీలో చిత్రించి... వీడియోను కుల్సుంపురా ఎస్సై అభిషేక్​కు పంపించాడు. వీడియో చూసిన ఎస్సై కోపోద్రిక్తుడై లాఠీతో శేఖర్​పై విరుచుకుపడ్డాడు. దెబ్బలు తాళలేక తన ఇంటికి పారిపోగా... ఎస్సైను నిలువరించేందుకు శేఖర్ భార్య, తల్లి ప్రయత్నించారు. ఈ క్రమంలో భార్య చేతిలో ఉన్న చిన్నారికి లాఠీ తగిలి గాయాలయ్యాయి. ఈ విషయంపై శేఖర్ కుల్సుంపురా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అంగీకరించలేదు. చేసేదేమి లేక శేఖర్... గోషామహల్ ఏసీపీ నరేందర్ రెడ్డికి, వెస్ట్ జోన్ డీసీ ఏఆర్ శ్రీనివాస్​కు లిఖిత పూర్వక ఫిర్యాదునిచ్చాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

ఇవీ చూడండి:బారికేడ్ల వల్ల ప్రమాదం- బాధితుడికి రూ.75 లక్షలు పరిహారం

ABOUT THE AUTHOR

...view details