విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర... రిషికేశ్ నుంచి విశాఖపట్నం చేరుకున్నారు. చాతుర్మాస్య దీక్ష నిమిత్తం మూడున్నర నెలల క్రితం స్వామీజీలు రిషికేష్ వెళ్లారు. ఈ నెల 2వ తేదీన దీక్ష ముగియడంతో ఆదివారం మధ్యాహ్నం తిరిగి విశాఖపట్నానికి చేరుకున్నారు. దాదాపు వంద రోజుల తర్వాత విశాఖకు చేరుకున్న స్వామీజీలకు పీఠం భక్తులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
విశాఖకు చేరుకున్న శారదా పీఠాధిపతులు - విశాఖకు చేరుకున్న శారదా పీఠాధిపతుల వార్తలు
ఏపీలోని విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర... రిషికేశ్ నుంచి విశాఖకు చేరుకున్నారు. చాతుర్మాస్య దీక్ష నిమిత్తం మూడున్నర నెలల అనంతరం పీఠానికి వచ్చిన వారికి భక్తులు స్వాగతం పలికారు.
xవిశాఖకు చేరుకున్న శారదా పీఠాధిపతులు
స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర పీఠంలో కొలువుదీరిన దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. రిషికేష్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో విగ్రహాలను శుద్ధి చేశారు. గోమాతకు ప్రత్యేక పూజలు చేసి శమీ వృక్షం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు నిర్వహించారు.
ఇదీ చదవండి
ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తాం: వినోద్ కుమార్
TAGGED:
విశాఖ శారదాపీఠం తాజా వార్తలు