హైదరాబాద్‌లో కొవిడ్ కేసులు మళ్లీ విపరీతంగా పెరుగుతుండడంతో.. ఈ ఏడాది శ్రీరామ నవమి శోభాయాత్రను రద్దు చేస్తున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. వైరస్ వ్యాపించకూడదనే ఆలోచనతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. అందుకు భక్తులంతా సహకరించాలని కోరారు.
శ్రీరామ నవమి శోభాయాత్ర రద్దు: ఎమ్మెల్యే రాజా సింగ్ - ధూల్ పేట శ్రీరామ శోభాయాత్ర రద్దు
ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రను ఈ ఏడాది రద్దు చేస్తున్నామని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రకటించారు. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
శ్రీరామ నవమి శోభాయాత్ర రద్దు
పండుగ రోజున ధూల్‌పేటలోని ఆకాశ్‌పూరి హనుమాన్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరుపుతామని అన్నారు. గతేడాది ఇదే క్రమంలో.. పెరుగుతున్న కేసుల దృష్ట్యా వేడుకలను రద్దు చేయడం తెలిసిందే.
ఇదీ చదవండి:అమర్నాథ్ మంచు శివలింగం దృశ్యాలు విడుదల