హైదరాబాద్ తార్నాకలో తెలంగాణ గంగపుత్ర మహాసభ ఆధ్వర్యంలో... భగవాన్ శ్రీ వేదవ్యాస బ్రహ్మ రుషి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి, దీపారాధనతో పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌కే ప్రసాద్ పాల్గొన్నారు. యావత్ ప్రపంచానికి ప్రకృతి సహజ ధర్మాలు బోధించే వేదాలను గ్రంధాల రూపంలో అందరికి అందుబాటులోకి తెచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రతి మత్స్యకారుడు, సంఘం ఆయన జయంతిని గంగాపుత్ర దివాస్‌గా జరుపుకుంటారని... ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు.
తార్నాకలో శ్రీ వేదవ్యాస మహర్షి జయంతి ఉత్సవాలు - Telangana Gangaputra Mahasabha celebrated Vedavyasa Maharishi birthday
భగవాన్ శ్రీ వేదవ్యాస బ్రహ్మ రుషి జయంతి ఉత్సవాలను హైదరాబాద్ తార్నాకలో తెలంగాణ గంగపుత్ర మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి, దీపారాధనతో పూజ చేశారు.

తార్నాకలో శ్రీ వేదవ్యాస మహర్షి జయంతి ఉత్సవాలు
మత్స్యకారులు చెరువులపై హక్కులు కోల్పోయే పరిస్థితి ప్రస్తుతం నేలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుల్లో మొదటి హక్కు మాకే చెందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల్లో మహాసభ మహిళా అధ్యక్షురాలు స్వరూప అమర్‌నాథ్, బండారి వెంకటేశ్ పృథ్వీ, పద్మారావు సాయి తిలక్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:బాసరలో కళతప్పిన గురు పౌర్ణమి ఉత్సవాలు