మహిళల కోసమే...'వీ అండ్ షీ' స్వాతంత్య్ర పోరాట యోధుల కుటుంబం... దేశభక్తి గురించి తాతలు చెప్పిన కథలు వింటూ పెరిగిన బాల్యం... ఇవీ హైదరాబాద్‌కు చెందిన శ్రావ్యా రెడ్డి నేపథ్యం. బాల్యం నుంచి ఉన్నంతలో పక్కవారికి సాయం చేయాలని నేర్చుకున్న శ్రావ్య.. బీటెక్ పూర్తవగానే.. గూగుల్లో వచ్చిన లక్షల రూపాయల కొలువును వదిలి సమాజ సేవకు కదిలింది. సమాజం నుంచి సమస్యలను ఎదుర్కొంటున్న ఒంటరి మహిళల కోసం వీ అండ్ షీ పేరుతో పాతికేళ్ల ప్రాయంలోనే ఒక ఎన్జీఓని స్థాపించింది. 31 రోజుల్లో తెలంగాణలో 31 జిల్లాలు పర్యటించి మహిళా సమస్యలపై అధ్యయనం చేయటమే కాదు.. త్వరలో నివేదికను ప్రభుత్వం ముందుకు తీసుకురానున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా అతివల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న శ్రావ్యారెడ్డితో ఈటీవీభారత్ ముఖాముఖి.