నటుడు నందమూరి బాలకృష్ణ కుడి భుజానికి శస్త్రచికిత్స చేసినట్లు హైదరాబాద్ కేర్ ఆస్పత్రి(Shoulder surgery to Balayya) వైద్యులు ప్రకటించారు. ఆరు నెలలుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య... అక్టోబర్ 31న బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరినట్లు(Shoulder surgery to Balayya) వైద్యులు తెలిపారు. కుడి చేతిని పైకి ఎత్తలేకపోతున్నానని... చాలా నొప్పిగా ఉంటుందని బాలయ్య తెలిపినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
Balakrishna: కేర్ ఆస్పత్రి నుంచి నందమూరి బాలకృష్ణ డిశ్చార్జి - shoulder surgery to balakrishna in care hospital
ప్రముఖ సినీ నటుడు, బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణకు శస్త్ర చికిత్స(Shoulder surgery to Balayya) జరిగింది. గత కొన్ని నెలలుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్ కేర్ ఆస్పత్రి వైద్యులు సర్జరీ(Shoulder surgery to Balayya) నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
Balakrishna
ఈ నేపథ్యంలో కేర్ ఆస్పత్రి షోల్డర్ సర్జన్ డాక్టర్ రఘువీర్ రెడ్డి, డాక్టర్ బీఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం దాదాపు నాలుగు గంటలపాటు(Shoulder surgery to Balayya) బాలయ్యకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి:MP Komatireddy: హుజూరాబాద్‌లో 'కాంగ్రెస్ పరిస్థితి'పై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు