రాష్ట్ర వ్యాప్తంగా అదృశ్యమైన చిన్నారుల కేసులను తిరిగి దర్యాప్తు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సుమారు 2 వేల మంది బాలబాలికలు తప్పిపోయినట్లు ఫిర్యాదులు వచ్చాయని... వీటిలో చాలా కేసులను పోలీసులు మూసేశారని రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. హాజీపూర్‌లో అదృశ్యమైన బాలికలు శ్రీనివాస్ రెడ్డి దురాఘతానికి బలయ్యారన్నారు.
అమ్మాయిల కేసులు తిరిగి దర్యాప్తు చేయాలి? - రాష్ట్ర వ్యాప్తంగా అదృశ్యమైన చిన్నారుల కేసులను తిరిగి దర్యాప్తు చేసేలా
తెలంగాణలో రకరకాల కారణాలతో అదృశ్యమవుతున్న అమ్మాయిల కేసులను తిరిగి దర్యాప్తు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని హైకోర్టులో ఈరోజు వ్యాజ్యం దాఖలైంది. వివిధ కారణాలతో 2 వేల మంది ఉన్నారని వారి పరిస్థితి ఏంటో కూడా తెలియదని పిటిషనర్ అన్నారు.
అమ్మాయిల కేసులు తిరిగి దర్యాప్తు చేయాలి?
హాజీపూర్ తరహా ఘటనలు రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా జరిగి ఉండొచ్చని పిటిషన్లో పేర్కొన్నారు. 2 వేల మందిలో 1350 మంది బాలికలు, 650 మంది బాలున్నారని తెలిపారు. ప్రస్తుతం వాళ్ల పరిస్థితి ఎంటో కూడా తెలియదని పిటిషనర్ అన్నారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి : జల్లికట్టు కోసం తన ఎద్దు సిద్ధమంటోన్న విద్యార్థిని!