అగ్రవర్ణ పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక హెచ్చరించింది. పొరుగు రాష్ట్రాల్లో అగ్రవర్ణాలకు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ సర్కార్ మాత్రం అగ్రవర్ణ పేదల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆ సంఘం నేతలు మండిపడ్డారు.
'ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి' - కేంద్రం కల్పించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల
కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర సర్కార్ 10 శాతం ఈడబ్ల్యూఎస్ను వెంటనే అమలు చేయాలి : ఏనుగు సంతోష్ రెడ్డి
TAGGED:
అగ్రవర్ణ పేదలకు