తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలోని రాజమహేంద్రవరంలో తెరుచుకున్న దుకాణాలు - shops open news in rajamahendravaram

లాక్​డౌన్​ నిబంధనల సడలింపులతో ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కిరాణా దుకాణాలు సాయంత్రం వరకూ తెరుచుకున్నాయి. ఫలితంగా ఇళ్లకే పరిమితమైన జనం సామాన్ల కోసం ఒక్కసారిగా దుకాణాల వద్దకు తరలివచ్చారు.

shops-open-in-rajamahendravaram
ఏపీలోని రాజమహేంద్రవరంలో తెరుచుకున్న దుకాణాలు

By

Published : May 5, 2020, 7:25 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని​ రాజమహేంద్రవరంలో దుకాణాలు ఈరోజు తెరుచుకున్నాయి. నిన్న మెయిన్‌ రోడ్డులోని షాపులు తెరిచేందుకు పోలీసులు అనుమతించలేదు. ఛాంబర్‌ ప్రతినిధులు, అధికారులతో చర్చించిన అనంతరం అనుమతి ఇవ్వటం వల్ల ఈరోజు షాపులు తెరుచుకున్నాయి.

నగరంలోని దేవీచౌక్‌, దానవాయిపేట, మెయిన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సడలింపుల మేరకు దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఇన్ని రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు దుకాణాలు వద్దకు పరుగులు తీశారు. ఉదయం పూట రహదారులు రద్దీగా మరాయి.

ఇదీ చూడండి: భారత్​లో 50 లక్షల మంది నిరాశ్రయులా?

ABOUT THE AUTHOR

...view details