సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట సినీనటుడు శివాజీ విచారణకు హాజరుకాలేదు. ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ ఈనెల 3న నోటీసులు అందించారు. తన కొడుకు ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్తున్నందున ఆ ఏర్పాట్లలో ఉన్నట్లు శివాజీ నుంచి పోలీసులకు మెయిల్ వచ్చింది.
విచారణకు హాజరుకాని సినీనటుడు శివాజీ - alanda media
అలంద మీడియా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు శివాజీ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత పనుల వల్ల హాజరుకాలేనంటూ మెయిల్ పంపారు.
అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 3న అమెరికా వెళ్లేందుకు... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. శివాజీని అదుపులోకి తీసుకొని 3న సైబరాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. కొద్దిసేపు ప్రశ్నించిన అనంతరం 11న మరోసారి పోలీసుల ఎదుట హాజరుకావాలంటూ నోటీసులిచ్చి పంపారు.
ఇవీ చూడండి: జులైలోనూ వానలు అంతంత మాత్రమే...!