తెలంగాణ

telangana

ETV Bharat / state

షిరిడీ సాయి హుండీ మరోసారి ఫుల్.. సామాన్యులకు సమాధిని స్పృశించే భాగ్యం - బంగారం వెండితో నిండిన షిరిడీ హుండీ

Shirdi Saibaba Temple: షిరిడీలో సాయి సమాధిని తాకే భాగ్యాన్ని ఇప్పుడు సామాన్య భక్తులకు సైతం కల్పించనున్నట్లు సాయి సంస్థాన్​ పేర్కొంది. ప్రస్తుతం వీఐపీలకు మాత్రమే ఉన్న అవకాశాన్ని ఇప్పుడు సామాన్యులకు కూడా కల్పించాలని నిర్ణయించారు. మరోవైపు ఈసారి పండుగలతో బాబా హుండీ బంగారం, వెండితో నిండిపోయింది. దీపావళి పర్వదినం సందర్భంగా సాయి ఖజానాకు ఏడున్నర కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి.

Shirdi Saibaba
Shirdi Saibaba

By

Published : Nov 11, 2022, 6:08 PM IST

Updated : Nov 11, 2022, 7:04 PM IST

Shirdi Saibaba Temple: షిరిడీ వెళ్లే భక్తులు ఆ సాయినాథుడ్ని దర్శనం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. నిత్యం ఆరతి, భజనలతో రద్దీగా ఉండే ఆలయానికి వచ్చే భక్తులకు ఒక్కసారైనా బాబా సమాధిని స్పృశించాలన్న ఆశ ఉంటుంది. ఒకప్పుడు అది సులభమే అయినప్పటికీ రానురానూ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా షిరిడీ సాయి సంస్థాన్ మార్పులు చేసింది.

భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టింది. ఒక్క వీఐపీ భక్తులకు మాత్రమే బాబా దగ్గరకు వెళ్లి ఆ సమాధిని తాకే అదృష్టం దక్కేది. సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు సామాన్యులకు కూడా సాయి సమాధిని తాకే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సాయి సంస్థాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భాగ్యశ్రీ బనాయత్‌ చెప్పారు.

మరోవైపు షిరిడీ బాబా హుండీ మరోసారి బంగారం, వెండితో నిండిపోయింది. దీపావళి పర్వదినం సందర్భంగా ఈసారి భారీ సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకున్నారు. ఫలితంగా సాయి ఖజానాకు ఏడున్నర కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇందులో భారతీయ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీ, వెండి, బంగారం, ప్లాటినం కూడా ఉన్నాయని సాయి సంస్థాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భాగ్యశ్రీ బనాయత్‌ తెలిపారు.

షిరిడీ సాయి హుండీ మరోసారి ఫుల్.. సామాన్యులకు సమాధిని స్పృశించే భాగ్యం

ఇవీ చదవండి:

Last Updated : Nov 11, 2022, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details