తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్మొనరీ ఫంక్షన్ ల్యాబ్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగం: వీవీఎస్ లక్ష్మణ్

గచ్చిబౌలి సన్ షైన్ హాస్పిటల్​లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించే పల్మొనరీ ఫంక్షన్ ల్యాబ్​ను మాజీ క్రికెటర్ లక్ష్మణ్ ప్రారంభించారు. క్రీడాకారులకు ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగకరమని అన్నారు.

By

Published : Aug 3, 2019, 10:56 PM IST

పల్మొనరీ ఫంక్షన్ ల్యాబ్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగం:వివిఎస్ లక్ష్మణ్

హైదరాబాద్ గచ్చిబౌలిలోని సన్ షైన్ హాస్పిటల్ మెరుగైన సేవలు అందించడంలో ముందుంటుందని, ఇటీవల ఏర్పాటు చేసిన "స్టేట్ అఫ్ ది ఆర్ట్" పల్మొనరీ ఫంక్షన్ ల్యాబ్ దేశంలోనే మొదటిదని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం కొత్తగా నెలకొల్పిన ల్యాబ్​ను ఆయన ప్రారంభించారు. ఈ పరికరం శాస్రీయ పద్ధతిలో శారీర సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తుందని, క్రీడాకారులకు ఫిట్​నెస్ పరీక్ష చేసుకొని సామర్థ్యం పెంచుకోవడానికి దోహదపడుతుందన్నారు. శరీరంలోని అవయవాల పనితీరును ఈ పరికరం తెలియజేస్తుందని సన్​షైన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గురువా రెడ్డి తెలిపారు.

పల్మొనరీ ఫంక్షన్ ల్యాబ్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగం:వివిఎస్ లక్ష్మణ్

ABOUT THE AUTHOR

...view details