Shilparamam Sankranthi Sambaralu: హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా ఉత్సాహంగా గడుపుతున్నారు. సంక్రాంతి వేళ గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు సందర్శకులను మంత్రముగ్దులను చేశాయి.
"ఈరోజు శిల్పారామంకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈసంవత్సరం పండగకి మా సొంతూరికి వెళ్లడానికి వీలు కాలేదు. ఇక్కడ పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్నట్లుగా అనుభూతి కలుగుతోంది. మా పిల్లలు బాగా సంతోషంగా ఉన్నారు. శిల్పారామంకు రావడంతో మా గ్రామానికి వెళ్లలేదన్న లోటు తీరింది".- పర్యాటకురాలు
పండుగ రోజు తరలివచ్చిన జనం సేదదీరేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృక కార్యక్రమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారో కళ్లకు కట్టినట్టు చూపేలా శిల్పారామంలో అలంకరణలు చేశారు.