తెలంగాణ

telangana

ETV Bharat / state

'మనసు ఏకాగ్రతకు ధ్యానం ఎంతో అనసరం'

ప్రపంచంలో 70 శాతం జనాభా మానసిక ఆందోళన, ఒత్తిడితో బాధపడుతున్నారని.. ఇవన్నీ తొలగిపోవాలంటే ప్రతి ఒక్కరిలో అంతర్గత చైతన్యం రావాలని ఆధ్యాత్మిక తత్వవేత్తలు ప్రీతాజీ, కృష్ణాజీ పేర్కొన్నారు.

'మనసు ఏకాగ్రతకు ధ్యానం ఎంతో అనసరం'

By

Published : Aug 24, 2019, 5:57 AM IST

యువత నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, 60 శాతం పెళ్లిళ్లు విడాకులతో ముగిస్తున్నాయని.. ఓ అండ్​ ఓ అకాడమీ వ్యవస్థాపకులు, తత్వవేత్తలు ప్రీతాజీ, కృష్ణాజీ తెలిపారు. మాదాపూర్ శిల్పకళా వేదికలో వారు రచించిన "ద ఫోర్ స్కేర్డ్ సీక్రెట్స్" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మానవ చైతన్యాన్ని ప్రభావితం చేయగలిగే తత్వజ్ఞానంతో పాటు ధ్యాన మార్గాలను వివరిస్తూ.. ఈ పుస్తకం రచించామని పేర్కొన్నారు. తాము ప్రేమతో ఆనందంగా జీవించగలిగే పరివర్తన మనిషి ఆలోచనలో రావాల్సిన అవసరం ఉందని ప్రీతాజీ, కృష్ణాజీ అన్నారు. ప్రశాంతంగా ఉండటానికి మనసు ఏకాగ్రత పెరగటానికి ధ్యానం ఎంతో అవసరమని సినీ నటి నిత్యామీనన్ వివరించారు. ఈ కార్యక్రమంలో భాజపా ఎమ్మెల్సీ రామచందర్​రావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, తదితరులు పాల్గొన్నారు.

'మనసు ఏకాగ్రతకు ధ్యానం ఎంతో అనసరం'

ABOUT THE AUTHOR

...view details