తెలంగాణ

telangana

ETV Bharat / state

అది వృద్ధాశ్రమమా ? వసతులే లేవు అక్కడ... - TG_Hyd_05_11_Vayo Vruddula Taralimpu_AV_TS10120

ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా సికింద్రాబాద్​లో కమలమ్మ వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారని ఆ శాఖ ఏడీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆశ్రమంలో ఉన్న వృద్ధులను ఇతర వసతి గృహాలకు తరలించారు.

ఇతర వసతి గృహాలకు వృద్ధుల తరలింపు
ఇతర వసతి గృహాలకు వృద్ధుల తరలింపు

By

Published : Feb 11, 2020, 6:51 AM IST

సికింద్రాబాద్ తుకారంగేట్ కమలమ్మ వృద్ధాశ్రమం అనుమతి లేకుండా కొనసాగుతోందని వికలాంగుల, వయోవృద్ధుల శాఖ హైదరాబాద్ ఏడీ పుష్పలత తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సిబ్బందితో కలిసి మూడు రోజుల క్రితం వృద్ధాశ్రమాన్ని సందర్శించినట్లు ఆమె తెలిపారు. 13 మంది వృద్ధుల ఆధార్ నెంబర్​ను నమోదు చేసుకున్నారు. అనంతరం వారిని భద్రతా నిమిత్తం నగరంలోని వివిధ ఆశ్రమాలకు తరలించారు.

భద్రతా ఏర్పాట్లెక్కడ ?

ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు ఉండాల్సిన దుస్థితి నెలకొందని ఏడీ పేర్కొన్నారు. ఆశ్రమ నిర్వాహకులు ఎలాంటి రికార్డులు సైతం నమోదు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇతర వసతి గృహాలకు వృద్ధుల తరలింపు

ఇవీ చూడండి : భార్య కళ్ల ముందే భర్తను చంపేశారు..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details