తెలంగాణ

telangana

ETV Bharat / state

రాయదుర్గంలో మైసమ్మ గుడి కూల్చొద్దంటూ.. భాజపా ఆందోళన! - హైదరాబాద్​ వార్తలు

భూకబ్జాదారులకు తెరాస మద్ధతు పలుకుతుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ భాజపా ఇంఛార్జి గజ్జెల యోగానంద్​ ఆరోపించారు. నియోజకవర్గంలోని రాయదుర్గంలోని మల్కం చెరువు కట్ట మైసమ్మ దేవాలయాన్ని ఓ నిర్మాణ సంస్థ తొలగించడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ.. ఆందోళనకు దిగారు.

Sheri Lingampally BJP Protest For Malkam Cheruvu Occupy
రాయదుర్గంలో మైసమ్మ గుడి కూల్చొద్దంటూ.. భాజపా ఆందోళన!

By

Published : Jul 2, 2020, 9:57 PM IST

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రాయదుర్గంలోని మల్కం చెరువు కట్ట మైసమ్మ దేవాలయాన్ని ఓ నిర్మాణ సంస్థ కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని భాజపా శేరిలింగంపల్లి ఇంఛార్జి గజ్జెల యోగానంద్​ ఆధ్వర్యంలోఆందోళనకు దిగారు. చెరువు ఎఫ్​టీఎల్​ను సైతం కబ్జా చేసి.. చెరువును పూడ్చి రోడ్డు నిర్మిస్తున్నారని.. అడ్డుగా ఉన్నందుకు పురాతన కట్టమైసమ్మ దేవాలయాన్ని కూడా కూలగొడుతున్నారని భాజపా నేతలు ఆందోళన నిర్వహించారు.

ముందు తరాల వారికి నీటి సౌకర్యం కల్పించే చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్న వారికి అధికారులు ఎలా అనుమతులిస్తారని.. వెంటనే కబ్జాదారులతో పాటు, అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఆ ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా లెక్క చేయకుండాగుడిని, చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేతలు, స్థానికులు డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, రజక సంఘం సభ్యులు చంద్ర శేఖర్, మత్స్య సహాకార సంఘం సభ్యులు సురేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇద చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ABOUT THE AUTHOR

...view details