'సహకారమివ్వండి... రక్షణ కవచంలా మారుతాం' - SWATHI LAKRA ON DISHA INCIDENT
దిశ హత్యాచారం వంటి ఘటనలు పునరావృతం కాకుండా.... అన్ని రకాలుగా చర్యలు చేపట్టనున్నట్లు మహిళా భద్రతా విభాగ అధిపతి స్వాతి లక్రా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అకాతాయిలను గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందితో పాటు... గ్రామస్థుల సహకారంతో... మూలమూలనా భద్రతనిచ్చేలా చర్యలు చేపడతామని భరోసానిచ్చారు. మహిళలకు గౌరవం ఇచ్చే మనస్తత్వం చిన్నప్పటి నుంచే అలవాటు చేసే విధంగా... విద్యాశాఖతో కలిసి విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులను త్వరలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దిశ ఘటనతో భయపడాల్సిన పనిలేదని... అన్నివేళలా భద్రత కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్న షీటీమ్స్ ఇన్ఛార్జి స్వాతి లక్రాతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
SHE TEAMS INCHARGE SWATHI LAKRA RESPONDED ON DISHA INCIDENT AND WOMEN SAFETY IN TELANGANA