పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఇందిరాభవన్ నుంచి వెబ్‌నార్ నిర్వహించారు. వెబ్నార్లో ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ పాల్గొన్నారు. మాజీ ప్రధాన మంత్రి, స్వర్గీయ పీవీ నరసింహా రావు నేతృత్వంలో భారత దేశం ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందన్నారు. 1991 నుంచి ఐదేళ్లపాటు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ సహకారంతో ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారని పేర్కొన్నారు.
పీవీ నరసింహా రావు సేవలు చిరస్మరణీయం: శశిథరూర్ - pv narasimha rao latest news
మాజీ ప్రధాన మంత్రి, స్వర్గీయ పీవీ నరసింహా రావు నేతృత్వంలో దేశం ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ అన్నారు. పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఇందిరాభవన్ నుంచి జరిగిన పీవీ విదేశాంగ విధానంపై జరుగుతున్న వెబ్‌నార్ సమావేశంలో పాల్గొన్నారు.
పీవీ నరసింహా రావు సేవలు చిరస్మరణీయం: శశిథరూర్
నరసింహా రావు ప్రపంచ మేధావి అని, దాదాపు 10 భాషల్లో మాట్లాడగలిగే గొప్ప వ్యక్తి అని కొనియాడారు. న్యూక్లియర్ వెపన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించడంలో పీవీ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇజ్రాయిల్ సాంకేతిక సహకారంతో సైన్యాన్ని పటిష్టం చేసిన ఘనత పీవీదేనని ఆయన అన్నారు. 1993లో చైనాలో పర్యటించి ఆ దేశంతో స్నేహహస్తం అందించటంతో బోర్డర్‌లో ఉద్రిక్తతలు తగ్గించారన్నారు.
ఇదీ చదవండి: పెంపుడు జంతువుల కోసం మొబైల్ సెలూన్లు!