తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ నూతన ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్ గోయల్ - election commission

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ నియమితులయ్యారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా కొనసాగిన రజత్ కుమార్ ఇటీవల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ నేపథ్యంలో కొత్త నియామకం జరిగింది.

shashank
shashank

By

Published : Mar 6, 2020, 11:15 PM IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా 1990 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా మొన్నటి వరకు ఉన్న రజత్ కుమార్ ఇటీవల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు.

ఆయన స్థానంలో సీఈఓగా నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఆ జాబితాను పరిశీలించిన ఈసీ శశాంక్ గోయల్​ను సీఈఓగా ఎంపిక చేసింది. ఆయన ప్రస్తుతం కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చూడండి :'కేటీఆర్​పై జీవో ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details