తెలంగాణ

telangana

ETV Bharat / state

వైఎస్​ షర్మిల నిరాహారదీక్ష.. మద్దతు తెలిపిన తల్లి విజయమ్మ - వైఎస్​ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర

Sharmila hunger strike to get permission for Praja Prasthan Yatra: లోటస్​పాండ్​ వద్ద కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రహదారిపై ఆమరణ నిరాహార దీక్షకు దిగిన షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన తరవాత తన నివాస ప్రాంగణంలోనే వైఎస్​ షర్మిల దీక్షకు దిగారు. ఇంకోవైపు షర్మిలకు మద్దతుగా షర్మిల తల్లి వైఎస్​ విజయమ్మ దీక్షలో కూర్చున్నారు.

ys Sharmila
వైఎస్​ షర్మిల

By

Published : Dec 9, 2022, 10:15 PM IST

Sharmila hunger strike to get permission for Praja Prasthan Yatra: ప్రజాప్రస్థాన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహర దీక్ష కొనసాగిస్తున్నారు. లోటస్‌పాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి.. మధ్యాహ్నం నుంచి ఆందోళన చేస్తుండటంతో కొద్దిసేపటి వరకు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన దీక్ష విరమించాలని పోలీసులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడంతో బలవంతంగా రోడ్డుపై నుంచి ఇంట్లోకి పంపించారు.

ఆ సమయంలో ఆ పార్టీ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మళ్లీ తిరిగి ప్రజాప్రస్థాన పాదయాత్రకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో మధ్యాహ్నం షర్మిల.. తెలుగుతల్లి ఫ్లైఓవర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి, నిరసన వ్యక్తం తెలిపారు. ఈ సందర్భంగా సైఫాబాద్ పోలీసులు ఆమెను అరెస్టు చేసిన తన నివాసం లోటస్‌పాండ్‌కు తరలించారు. కానీ, ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె రోడ్డుపై ఆమరణ దీక్షకు ఉపక్రమించారు. ఈ దీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగింది.

రాత్రి 8 గంటల సమయం కావడంతో పోలీసులు బలవంతంగా రోడ్డుపై నుంచి ఇంట్లోకి పంపడంతో నివాస ప్రాంగణంలో టెంట్‌ కింద షర్మిల ఆమరణ దీక్ష కొసాగిస్తున్నారు. షర్మిలకు మద్ధతుగా తన తల్లి వైఎస్ విజయమ్మ కూడా దీక్షలో కూర్చున్నారు. ప్రజా ప్రస్థాన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తన ఆమరణ నిరాహర దీక్ష కొనసాగిస్తానని హెచ్చరించారు. తన తల్లి విజయమ్మను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details