తెలంగాణ

telangana

ETV Bharat / state

Sharmila: 'టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ నుంచి మంత్రి కేటీఆర్​ను కాపాడేందుకే సిట్' - ఇందిరాపార్క్ వద్ద అఖిల పక్షం ధర్నా

Sharmila Comments at T-SAVE Nirudyoga Deeksha: ప్రగతిభవన్, కేటీఆర్ డైరెక్షన్​లో సిట్ విచారణ జరుగుతోందని వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు వైెఎస్ షర్మిల ఆరోపించారు. మంత్రి కేటీఆర్​ను కాపాడేందుకే సిట్ వేశారన్న ఆమె.. సీఎం కేసీఆర్​, కేటీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సీబీఐతో విచారణకు ఆదేశించాలని సవాల్​ విసిరారు. సర్కార్ కళ్లు తెరిపించేందుకే నిరుద్యోగుల కోసం కొట్లాట అని వ్యాఖ్యానించారు. టీఎస్‌పీఎస్‌సీ లీకేజ్‌పై సీఎం పేరిట ప్రశ్నపత్రం విడుదల చేశారు.

sharmila
sharmila

By

Published : Apr 26, 2023, 4:29 PM IST

Updated : Apr 26, 2023, 7:06 PM IST

Sharmila Comments at T-SAVE Nirudyoga Deeksha: రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి రాజకీయ వేడి రాజేస్తున్న టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు సిట్ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యవహారంపై తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షాలు అయినా కాంగ్రెస్, బీజేపీ ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ మార్చ్​, నిరుద్యోగ నిరసన దీక్షలు చేపడుతోంది. తాజాగా ఇదే ఘటనపై టి-సేవ్ ఫోరం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద అఖిల పక్షం నిరుద్యోగ దీక్ష చేపట్టింది. వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు వైెఎస్ షర్మిల, ప్రజా గాయకుడు గద్దర్ ఈ దీక్షలో పాల్గొన్ని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆరోపణలు గుప్పించారు.

కేటీఆర్​ను కాపాడేందుకే సిట్ వేశారు: ప్రగతిభవన్, కేటీఆర్ డైరెక్షన్​లో సిట్ విచారణ జరుగుతుందని వైఎస్ షర్మిల ఆరోపించారు. మంత్రి కేటీఆర్​ను కాపాడేందుకే సిట్ వేశారన్నారు. సీఎం కేసీఆర్​, కేటీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సీబీఐతో విచారణకు ఆదేశించాలని సవాల్​ విసిరారు. ఐటీ శాఖ చట్టం ప్రకారం ప్రభుత్వ పరిధిలో వాడే ప్రతీ కంప్యూటర్‌‌కు ఆడిట్ జరగాలని షర్మిల అన్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసిన కేటీఆర్‌కు ఫైర్ వాల్స్ అంటే తెలియదా అని ఆమె ప్రశ్నించారు. ఐపీ అడ్రస్ తెలిస్తే టెర్రరిస్ట్‌లు కూడా ప్రభుత్వ సిస్టంలను హ్యాక్ చేయొచ్చని మండిపడ్డారు. ప్రభుత్వ పరిధిలో వాడుతున్న కంప్యూటర్లకు ఎన్నింటికి భద్రత సర్టిఫికెట్లు ఉన్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ లీకేజ్‌పై సీఎం పేరిట ప్రశ్నపత్రం విడుదల చేసిన షర్మిల.. టీసేవ్​ నుంచి పది ప్రశ్నలతో ఈ ప్రశ్నపత్రం పంపిస్తున్నామని... వాటికి జవాబు ఇవ్వాలని పేర్కొన్నారు.

డాటర్ లిక్కర్ స్కామ్.. కేటీఆర్ పేపర్ స్కామ్: సిట్ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని వైఎస్ షర్మిల ఆరోపించారు. సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదని వినతిపత్రం ఇవ్వాలనుకుని వెళ్తుంటే తనను అరెస్టు చేశారని మండిపడ్డారు. టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రం ఎలా హ్యాకింగ్ అయ్యిందనే దిశగా సిట్ ఆలోచన చేస్తోందా అని ధ్వజమెత్తారు. కేటీఆర్ ఐటీ మంత్రి కదా.. ఆయన బాధ్యతలేంటో అసలు తెలుసా అని ప్రశ్నించారు. సాఫ్ట్​వేర్​, సిస్టమ్స్​ ఆడిట్.. ఐటీ శాఖ పరిధిలోకి వస్తుందన్న ఆమె... కేటీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే టీఎస్​పీఎస్సీ ఆడిట్ సర్టిఫికెట్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్​పీఎస్సీ పేపర్స్ లీక్ అయ్యాయంటే దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది ఐటీ శాఖ, ఆ శాఖ మంత్రి కేటీఆర్ అని మరోసారి షర్మిల పునరుద్ఘాటించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం స్కాంలతో కూరుకుపోయిందన్న ఆమె.. కేసీఆర్ వాటర్ స్కాం, బిడ్డ లిక్కర్ స్కాం, కొడుకు టీఎస్‌పీఎస్సీ పేపర్ స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు.

'ఈ దీక్ష కోసం పోలీసుల అనుమతి కోరితే అనుమతించలేదు. కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నాం. నేను ఒక్కదాన్ని సిట్ ఆఫీస్​కు వెళుతుంటే నన్ను అరెస్ట్ చేసి.. జైళ్లో పెట్టాలని ప్రభుత్వం, పోలీసులు భావించారు. రాజకీయాలు అంటేనే అసహ్యించుకునేదాన్ని నేను.. ఇక్కడ ఎటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ పాలన లేకపోవడంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. పార్టీ స్థాపించకముందే ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేసేందుకు వస్తే పోలీసులు నానా హంగామా చేశారు. అప్పుడు ఇంటివద్ద 72 గంటల దీక్ష చేశాను. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేశాను. బిడ్డను చూసేందుకు వచ్చిన విజయమ్మను అడ్డుకుని కాళ్లు తొక్కారు.. అప్పుడు ఆమె స్పందించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే పోలీసులను వాడుకుంటున్నారు. పోలీసులు నా పక్కన నడవడం సేఫ్ కాదని.. సెల్ఫ్ డిఫెన్స్ కోసమే పోలీసులను తోశాను.'-వైఎస్ షర్మిల, వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు

ఇవీ చదవండి:

Last Updated : Apr 26, 2023, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details