తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటర్ల గుర్తింపులో పార్టీలను భాగస్వామ్యం చెయ్యండి: భాజపా - undefined

మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇప్పటికే ఓ వ్యాజ్యం పెండింగ్​లో ఉన్నదని అన్నింటిపై కౌంటరు దాఖలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అనంతరం ఈనెల 29కి విచారణ వాయిదా వేసింది.

ఓటర్ల గుర్తింపులో భాగస్వామ్యం చెయ్యండి:భాజపా

By

Published : Jul 26, 2019, 9:10 PM IST

మున్సిపాలిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలంటూ భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చట్టబద్ధంగా జరగడం లేదని.. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. మున్సిపాలిటీల్లోఎన్నికలపై ఇప్పటికే ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పెండింగ్​లో ఉందని అన్నింటిపై కలిపి కౌంటరు దాఖలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం మల్లారెడ్డి వ్యాజ్యాన్ని కూడా పెండింగ్​లో ఉన్న వ్యాజ్యంతో జత చేసి ఈనెల 29కి విచారణ వాయిదా వేసింది.

For All Latest Updates

TAGGED:

HI_COURT

ABOUT THE AUTHOR

...view details