శంషాబాద్ పశువైద్యురాలి హత్యకు నిరసనగా ఈనెల 10న షరబ్ హఠావో- తెలంగాణ బచావో అనే డిమాండ్‌తో నగరంలో ఒక రోజు ఆటో బంద్‌కు ఐకాస కన్వీనర్ అమనుల్లా ఖాన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉండి ఉంటే, ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదన్నారు. మద్యం మత్తులోనే నలుగురు దుండగులు ఈ కిరాతకానికి పాల్పడ్డారని అన్నారు.
యువతి మృతికి నిరసనగా 10న ఆటోల బంద్ - Sharab Hathao- Telangana Bachao is a day auto bandh in the city
శంషాబాద్ పశువైద్యురాలి ఆత్మ సంతృప్తి చెందాలంటే హంతకులను వెంటనే ఉరి తీసి, రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస డిమాండ్ చేసింది. ఈనెల 10న షరబ్ హఠావో-తెలంగాణ బచావో అనే డిమాండ్‌తో ఒక రోజు ఆటో బంద్‌కు పిలుపునిచ్చారు.
![యువతి మృతికి నిరసనగా 10న ఆటోల బంద్ Sharab Hatho Telangana Bachao on December 10th at hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5235444-1090-5235444-1575199139785.jpg)
డిసెంబర్ 10న షరబ్ హఠావో తెలంగాణ బచావో
రోడ్డు ప్రమాదాలు, సామాజిక నేరాలు పెరగడానికి ప్రధాన కారణం మద్యమని, దాని వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించకుంటే 10న ఆటో డ్రైవర్లు అందరూ బంద్‌లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
డిసెంబర్ 10న షరబ్ హఠావో తెలంగాణ బచావో
ఇదీ చూడండి : సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం : రేవంత్