తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాక్సిన్ వచ్చేది అప్పుడే: శాంతా బయోటెక్ ఛైర్మన్ - శాంతా బయోటెక్ చైర్మన్

వ్యాక్సిన్ ఎవరూ కనిపెట్టినా... ప్రపంచంలోని 70 శాతం జనాభాకు అందించే శక్తి కేవలం భారత్​కే ఉంది... అందులో మరీ ముఖ్యంగా హైదరాబాద్​కు ఆ సత్తా ఉందని శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ నాటికల్లా భారత్​కు వ్యాక్సిన్ వస్తోంది అంటున్న శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డితో సన్​షైన్ ఆస్పత్రుల ఎండీ గురవారెడ్డి ముఖాముఖి...

shantha-biotech-chairman-about-corona-vaccine
వ్యాక్సిన్ వచ్చేది అప్పుడే: శాంతా బయోటెక్ ఛైర్మన్

By

Published : May 14, 2020, 1:34 PM IST

Updated : May 14, 2020, 1:50 PM IST

వ్యాక్సిన్ వచ్చేది అప్పుడే: శాంతా బయోటెక్ ఛైర్మన్

ప్ర. సెప్టెంబర్​లో వ్యాక్సిన్ వస్తుందని చెప్పారుగా దాని గురించి మీ మాటల్లో...

జ.సెప్టెంబర్​లో వ్యాక్సిన్ రావడం కష్టం. దాని మీద ప్రోగ్రస్ చాలా ఉంది. ఆక్స్​ఫర్డ్​లో వ్యాక్సిన్ గురించి చాలా కృషి చేస్తున్నారు. పగలు, రాత్రి శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. ఇక్కడ శాస్త్రవేత్తలు అక్కడి వారితో చర్చిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరాంతానికి వ్యాక్సిన్ వచ్చే వీలుంది. అక్కడ అనుమతులు లభించగానే... భారత్​కు వస్తోంది. ప్రజలందరికీ అవసరమనుకున్న పద్ధతిలో మార్చి లేదా ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.

ప్ర. ఎన్ని కంపెనీలు ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్​లో ముందంజలో ఉన్నాయి?

జ. మొత్తం ఐదు బయోటెక్ కంపెనీలు మన దేశంలో ఉన్నాయి. వీటిలో నాలుగు కంపెనీలు మన హైదరాబాద్​లోనే ఉన్నాయి.

ప్ర. బల్క్ ప్రొడక్షన్​లో మన దేశమే... ప్రపంచానికి సప్లై చేస్తుందా?

జ. కచ్చితంగా... మనకు కావలసినన్ని వనరులు, మేథోసంపత్తి పుష్కలంగా ఉన్నాయి. 25 సంవత్సరాల క్రితమే మనం డబ్ల్యూహెచ్​వో నుంచి ప్రీ క్వాలిఫికేషన్​ను తెచ్చుకున్నాం. చైనాకు నాలుగేళ్ల క్రితం వచ్చింది. దీని బట్టి చూస్తే మనం చాలా ముందంజలో ఉన్నాం.

ప్ర. చైనా వాళ్లకంటే వ్యాక్సిన్ మనం తక్కువ రేటుకి ఇస్తామంటారా?

జ. తప్పకుండా. వాళ్ల కన్నా తక్కువ రేటులో చేయగలం.

ఇవీ చూడండి:కరోనాతో సహజీవనం అంటే ఇదేనా!

Last Updated : May 14, 2020, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details