షేక్‌పేట తహసీల్దార్ సుజాత అరెస్టు - Shaikpet mro sujatha arrest

18:57 June 08
షేక్‌పేట తహసీల్దార్ సుజాత అరెస్టు
బంజారాహిల్స్ భూ వివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్ సుజాత అరెస్టయ్యారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు సేకరించిన అధికారులు... ఈరోజు నాంపల్లి అ.ని.శా కార్యాలయంలో సుమారు 7 గంటలు పాటు విచారించారు. మూడో రోజు ఎమ్మార్వో నుంచి కీలక ఆధారాలు సేకరించారు. సుజాత నుంచి మరోసారి స్టేట్మెంట్ నమోదు చేశారు. బంజారాహిల్స్ భూ వ్యవహారంలో అధికారి పాత్రపై అధికారులు ఆరా తీశారు. సుజాత ఇంట్లో స్వాధీనం చేసుకున్న రూ. 30 లక్షలకు సంబంధించిన వివరాలపై అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధానంగా రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన ఆర్ఐ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ సెక్టార్ ఎస్సై రవీంద్రనాయక్‌ను ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి: పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులు ప్రమోట్