తెలంగాణ

telangana

ETV Bharat / state

విధి కూడా... పైశాచికుల పంచన చేరిందా...? - LATEST RAPE CASES IN TELANGANA

సంచలనం రేపిన వైద్యురాలి హత్యకేసులో మృతురాలిని దురదృష్టం రెండు సార్లు వెంటాడింది. ఆరాంఘర్​లో లారీ అన్​లోడ్ చేయాల్సిన బిల్డర్ నిందితుల ఫోన్ ఎత్తి ఉంటే రాత్రే వెళ్లిపోయేవాళ్లు. ద్విచక్రవాహనం టోల్​గేట్ వద్ద పార్క్ చేయొద్దని సిబ్బంది చెప్పినప్పుడు యువతి వెళ్లిపోవాల్సింది. ఈ రెండూ కాకుండా తన చెల్లి చెప్పినట్లు భయం వేసినప్పుడు టోల్​బూత్​ దగ్గరకు వెళ్లి సిబ్బంది సాయం కోరినా పరిస్థితి ఇంకోలా ఉండేదేమో...!!! యువతి బయలుదేరినప్పటి నుంచి ఎదురైన కర్కష గడియలు తనకు వ్యతిరేకంగా మారాయి.

SHADNAGAR MURDER CASE DETAILED STORY WITH TIMING
SHADNAGAR MURDER CASE DETAILED STORY WITH TIMING

By

Published : Nov 30, 2019, 6:43 AM IST

Updated : Nov 30, 2019, 7:24 AM IST

"పిల్ల అందంగా ఉంది... ఈ అవకాశాన్ని వదులు కోకూడదు... తాను ప్రతిఘటిస్తే ఏం చేయాలి... ఎలా అనుభవించాలి" మద్యం సేవిస్తూ... నిందితుడు ఆరిఫ్​ తన స్నేహితులతో చేసిన వ్యాఖ్యలివి. శంషాబాద్​ టోల్​గేట్​ వద్ద జరిగిన దారుణంలో నిందితులు పైశాచికంగా... యువతిని హతమార్చారు.

నాటకమాడి... నాశనం చేశారు...

టోల్ గేట్ వద్ద స్కూటీని యువతి పార్క్ చేయడాన్ని నిందితులు గమినించారు. రాత్రి తిరిగి స్కూటీ కోసం వస్తుందని వేచి చూశారు. స్కూటీ టైరులోని గాలి తీసేశారు. యువతి తిరిగిరాగానే సాయం చేస్తున్నట్లు నమ్మబలికారు. టైరు పంక్చర్​ అయిందని నాటకం ఆడి చివరికి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఆ నలుగురు పైశాచికులు. తొండుపల్లి ఓఆర్ జంక్షన్ నుంచి మృతదేహాన్ని కాల్చిన ఘటనా స్థలికి మధ్య దూరం 28.37 కిలోమీటర్లు, జాతీయ రహదారి కావటం వల్ల మహా అయితే ఆ దూరాన్ని చేరుకునేందుకు సుమారు అరగంట పడుతుంది. పెట్రోల్ కోసం నిందితులు వెళ్లితే... ఇంకో అరగంట పట్టినా..రాత్రి 10.33 గంటలకు బయలుదేరిన లారీ కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకైనా షాద్​నగర్ సమీపంలోని చటాన్​ల్లికి చేరుకోవాలి. కానీ.. తెల్లవారుజామున 2 నుంచి 2.30 గంటల మధ్య చేరుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో నిందితులు ఏం చేశారన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది.

సీసీటీవీ దృశ్యాలే పట్టించాయి...

ఈ నెల 27న రాత్రి శంషాబాద్ పోలీసులకు యువతి అదృశ్యంపై ఫిర్యాదు అందింది. 28న ఉదయం 7.30 గంటలకు షాద్​నగర్ సమీపంలోని చటాన్​పల్లిలో ఓ మృతదేహం దహనం అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని సీపీ సజ్జానార్ వివరించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించామన్నారు. మృతురాలి తండ్రి , సోదరి ఘటనా స్థలానికి వచ్చి యువతిని గుర్తుపట్టారు. పది బృందాలతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా... లారీతో పాటు నిందితుల్ని పట్టుకున్నారు.

గడియగడియ గండమాయే....

  1. సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్​ నక్షత్రకాలనీ నుంచి యువతి బయలుదేరింది.
  2. 6:08 గంటలకు టోల్‌గేట్ వద్దకు చేరుకుంది.
  3. 6:12 కు తొండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో బైక్​ పెట్టింది.
  4. 6 :13 గచ్చిబౌలికి బయలుదేరి వెళ్లింది.
  5. 9.13కు తిరిగి తొండుపల్లి ప్లాజాకు చేరుకుంది.
  6. 9.19 గంటలకు సోదరికి ఫోన్ చేసింది.
  7. 9.23కు పంక్చర్ వేయిస్తానని నిందితుడు శివ వాహనం తీసుకెళ్లాడు
  8. 9.28కు పంక్చర్ షాప్ తీసిలేదని తిరిగి వచ్చాడు.
  9. 9.30కు మళ్లీ పంక్చర్ వేయిస్తానని తీసుకెళ్లాడు.
  10. 9.35కు ద్విచక్రవాహనంతో తిరిగి వచ్చాడు.
  11. 9:44కు యువతి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది .
  12. 10:28కు ద్విచక్రవాహనం ఘటనాస్థలం నుంచి బయల్దేరింది.
  13. అప్పటికే యువతి చనిపోయింది. మృతదేహాన్ని రగ్గులో చుట్టుకుని తీసుకెళ్లారు.

పూర్తిగా కాలిపోయాకే వెళ్లారు...

తొలుత ఎస్సార్ పెట్రోల్ బంకు వద్ద బాటిల్​లో పెట్రోల్ పోయించుకునేందుకు నిందితులు వెళ్లారు. ద్విచక్రవాహనం ఎక్కడుందంటూ నిర్వాహకులు ప్రశ్నించేసరికి.... అక్కడి నుంచి వచ్చేశారు. సమీపంలోని ఇండియన్ఆయిల్ బంక్​లో పెట్రోల్ పోయించుకుని వచ్చి షాద్​నగర్ శివారు చటాన్​పల్లి వంతెన వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మృతదేహం కాలిందా... లేదా అని కాసేపటి తర్వాత వచ్చి పరిశీలించారు. పూర్తిగా కాలిపోయిందని నిర్ధరించుకున్నాకే తిరుగు పయనమయ్యారు. అక్కడి నుంచి బయలుదేరి మార్గమధ్యలో స్కూటీని వదిలేసి నలుగురు కలిసి లారీలో బయలేరారు. గురువారం ఉదయం ఆరాంఘర్​కు చేరుకున్నారు.

అలసత్వం వహించింది నిజమైతే చర్యలు...

ఘటన జరిగిన రోజు ఫిర్యాదు చేయడానికి వస్తే అలసత్వంగా వ్యవహరించారని... మృతురాలు గురించి చెడుగా మాట్లాడారంటూ వస్తున్న ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. 11.40కు శంషాబాద్ ఆర్టీఏఐ ఠాణాలో ఫిర్యాదు అందిందని... అక్కడి సిబ్బంది 3 బృందాలుగా ఏర్పడి తొండుపల్లి జంక్షన్ వరకు వెళ్లి పరిశీలించారన్నారు . 12 నుంచి 12 . 30 వరకు సీసీ ఫుటేజీని పరిశీలించినట్లుగా వివరించారు. రాత్రి 1:15 గంటలకు టోల్‌గేటు క్యాబిన్ ఇంఛార్జీని విచారించగా... మృతురాలు అక్కడికి బండి పెట్టేందుకు వచ్చినట్లు గుర్తించామని తెలిపారు. 1.25 గంటలకు తల్లిదండ్రులు ఠాణాకు రాగా... వెంట పెట్టుకుని టోల్‌ప్లాజాకు వెళ్లి... తెల్లవారుజాము 5.30 వరకు వెతికినట్లు చెప్పారు. ఇదే సమయంలో తెల్లవారుజామున రాత్రి 3:10 సమయంలో ఏఆర్ రిజిస్టర్ చేశామని సీపీ తెలిపారు. బాధితులు ఎవరైనా ఆపదలో వెంటనే 100 నంబరుకు ఫోన్ చేయాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు ఇంకా జరగకూడదని...నిందితులకు కఠిన శిక్ష విధించాలని మృతురాలి సోదరి డిమాండ్ చేసింది.

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

Last Updated : Nov 30, 2019, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details