తెలంగాణ

telangana

ETV Bharat / state

'షాద్​నగర్ - గొల్లపల్లి డబుల్ లైన్​ ప్రారంభం ఓ మైలురాయి' - south central Zone latest news

షాద్ నగర్, గొల్లపల్లి మధ్య డబ్లింగ్ రైలు మార్గం పనులు పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ - మహబూబ్​నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్ట్​లో భాగమని పేర్కొంది.

Breaking News

By

Published : Sep 17, 2020, 1:08 PM IST

హైదరాబాద్ నగరాన్ని మహబూబ్​నగర్ , కర్నూల్ , అనంతపురం , బెంగళూరు , కడప , తిరుపతి వంటి ప్రధానమైన పట్టణాలకు రైలుతో అనుసంధానం చేయడంలో దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని చేరింది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణలో భాగంగా షాద్ నగర్ - గొల్లపల్లి మధ్య డబ్లింగ్ రైలు మార్గం పనులు పూర్తిచేసి సెప్టెంబర్ 16న దమ.రైల్వే ప్రారంభించింది. ఈ పనులు రైల్వే పీఎస్​యూ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎల్ ) ఆధ్వర్యంలో చేపట్టింది.

మరింత బలోపేతం కోసం..

తెలంగాణలో రైళ్ల నిర్వహణ మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టిన ప్రాజెక్టుల్లో సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్ట్ చాలా కీలకమైనది. 2015-16లో 85 కి.మీ. నిడివిగల ఈ ప్రాజెక్టు రూ.774 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైంది. సికింద్రాబాద్ - ఉందానగర్ సెక్షన్​లో డబ్లింగ్, విద్యుదీకరణ పనులు ఎమ్ఎమ్​టీఎస్ ఫేజ్ -1, 2 ప్రాజెక్ట్​లో భాగంగా చేపట్టడం వల్ల, సెక్షన్​లో మిగిలిన ఉందానగర్ - మహబూబ్​నగర్ భాగం డబ్లింగ్, విద్యుదీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.

ఇదో మైలురాయి..

ప్రస్తుతం సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్ ప్రాజెక్ట్​లో భాగంగా షాద్ నగర్- గొల్లపల్లి మధ్య 29 కిమీ నిడివిగల నూతన డబుల్ లైన్​ను ప్రారంభించడాన్ని మైలురాయిగా భావిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆనందం వ్యక్తం చేసింది.

స్టేషన్ యార్డుల ఆధునీకీకరణ..

షాద్​నగర్ - గొల్లపల్లి ప్రాజెక్ట్​లో అదనంగా లైన్ల నిర్వహణకు వీలుగా షాద్ నగర్ , గొల్లపల్లి , బాలానగర్ స్టేషన్ యార్డులను ఆధునీకీకరించారు. గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించే నూతన స్టేషన్ భవనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ప్రణాళికాబద్ధమైన ఆవరణ , బుకింగ్ గదులు, సౌకర్యవంతమైన ప్లాట్ ఫారాలు , పాదచారుల వంతెనలు, తాగునీరు వంటి ప్రయాణికుల సౌకర్యాలు కల్పించారు.

అంతటి వేగాన్ని తట్టుకునేందుకు.

గంటకు 130 కి.మీ. వేగంతో వెళ్లే 25 టన్నుల యాక్సెల్ లోడ్​లను తట్టుకోగలిగే విధంగా రైలు మార్గాన్ని రూపొందించారు. పీఎన్​సీ గర్డర్లతో 3 పెద్ద వంతెనలు, ఆర్​సీసీ బాక్స్​తో 52 చిన్న వంతెనలు నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి : 1948లో నిజాం రాజ్యం కుప్పకూలిన క్షణమిదే !

ABOUT THE AUTHOR

...view details