దేశ వ్యవసాయరంగ అభివృద్ధి కోసం స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు దిల్లీలో రైతులు చేపడుతోన్న ఆందోళనకు మద్దతుగా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టింది.
కేంద్రానివి రైతు వ్యతిరేక విధానాలు: ఎస్ఎఫ్ఐ - రైతులకు మద్దతుగా హెచ్సీయూలో విద్యార్ధుల ధర్నా
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం ఆరోపించింది. దిల్లీలో ఆందోళన చేపడుతోన్న రైతులకు మద్దతుగా ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టింది.
కేంద్రానివి రైతు వ్యతిరేక విధానాలు: ఎస్ఎఫ్ఐ
కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం నేతలు ఆరోపించారు. భాజపా ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు కోరుతున్న మద్దతు ధరను అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:సూర్యాపేట భాజపా అధ్యక్షుడు అరెస్ట్.. గుర్రంబోడు ఘర్షణే కారణం