ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘాలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించాయి. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు బేగంపేటలోని ప్రగతిభవన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Pragathi bhavan: ప్రగతి భవన్ ఎదుట ఆందోళనలు.. ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ - sfi and dyfi activists protests at pragathi bhavan
నిరుద్యోగుల నినాదాలతో ప్రగతిభవన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

ప్రగతి భవన్ ఎదుట ఆందోళనలు
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యాసంస్థల్లో భౌతిక తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నేతలు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ప్రగతి భవన్ ఎదుట రోడ్డు పైకి రాగా.. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రగతి భవన్ ఎదుట ఆందోళనలు
ఇదీ చదవండి:Tragedy : తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టనన్న కుమారుడు.. అంత్యక్రియలు చేసిన కుమార్తె