తెలంగాణ

telangana

ETV Bharat / state

Sexual Assault Hyderabad : తల్లితో సహజీవనం.. కుమార్తెపై లైంగిక వేధింపులు.. చివరికి..! - Man Sexually Abused His Girlfriend Daughter

Sexual Harassment in Hyderabad : పోలీసులు ఎన్ని చట్టాలు తెెచ్చినా మహిళలను వేధించేవారు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇటీవలి తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. తాజాగా భాగ్యనగరంలో ఓ ప్రబుద్ధుడు.. ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెను లైంగికంగా వేధించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

Sexual Assault
Sexual Assault

By

Published : Jul 16, 2023, 10:36 AM IST

Man Sexually Harassed Step Daughter :తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. తామూ ఓ తల్లికే పుట్టామని, తమకూ అక్కాచెల్లెల్లు ఉంటారని మరిచి అకృత్యాలకు పాల్పడుతున్నారు కొందరు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడపిల్ల కనిపిస్తే చాలు.. దారుణాలకు ఒడిగడుతున్నారు.! ఇంకొందరు వావివరుసలు మరిచి కుటుంబం, బంధువుల్లోని అబలలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కీచకుడు మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెనులైంగికంగా వేధింపులకుగురి చేసిన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని దాసారంబస్తీకి చెందిన 50 సంవత్సరాల వయసు కలిగిన ఓ మహిళ ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త వదిలేసి వెళ్లడంతో కుమార్తె, కుమారుడితో కలిసి జీవనం సాగిస్తోంది. చిన్నాచితక పనికి వెళుతూ వచ్చిన సంపాదనతో పిల్లలను చదవిస్తూ నానాకష్టాలు పడుతూ కూతురు(19), కొడుకుని పెంచి పెద్ద చేసింది. వయసు మీద పడుతుండటంతో ఆమె అనారోగ్యానికి గురవడంతో ఎదిగొచ్చిన కుమార్తె... తల్లి కష్టాన్ని చూసి చలించింది. దీంతో కుమార్తె నగరంలో ప్రైవేటు ఉద్యోగంలో జాయిన్ అయింది. వచ్చే జీతంతో ఇంటి బాధ్యతలు చూసుకుంటోంది.

Man Sexually Abused His Girlfriend's Daughter :ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట యువతి తల్లి అనారోగ్యానికి గురవడంతో ఉద్యోగ రీత్యా తనకు ఈఎస్​ఐ సౌకర్యం ఉండడంతో అక్కడకు తీసుకెళ్లింది. అప్పుడు ఈఎస్​ఐ ఆసుపత్రిలో వారికి 57 సంవత్సరాల వయసు ఉన్న నాగరాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వారి నిస్సహాయతను అదునుగా భావించి వారికి నాగరాజు సాయం చేసినట్లు నటించాడు. ఆ తర్వాత చికిత్స అనంతరం ఆమెను తీసుకొచ్చి యువతి ఇంటి వద్ద దిగబెట్టాడు. యువతి తల్లితో మాట కలిపి తన భార్య కూడా తనను వదిలిపెట్టి వెళ్లిందని చెప్పాడు. తాను ఒంటరిగానే ఉంటున్నానని చెప్పాడు.

అసలు బాగోతం బయటపడిందిలా : తమకు చేదోడుగా వాదోడుగా ఉంటాడనుకున్నారో ఏమో తెలియదు కానీ నాగరాజు అప్పటి నుంచి వారితోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో యువతి తల్లితో కలిసి సహజీవనం సాగిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత అతనిలోని మరో రూపం బయటకు వచ్చింది. యువతి తల్లి పని మీద బయటకు వెళ్లేది. ఈ క్రమంలో ఇంట్లో లేని ఎవరూ లేని సమయంలో ఆమె కుమార్తెను వేధించడం ప్రారంభించాడు. తన కోర్కె తీర్చాలని ఇబ్బందిపెడుతున్నాడు. తట్టుకోలేని యువతి విషయం తల్లికి చెప్పింది. వారు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు నాగరాజును అరెస్టు చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details