గిరిజనుల ఆరాధ్య గురువు శ్రీ సేవాలాల్ మహరాజ్ 282 జయంతి ఉత్సవాలు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయడానికి ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు - telangana news
సేవాలాల్ మహా రాజ్ జయంతి రోజైన ఫిబ్రవరి 15ను రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని లంబాడీల ఐక్యవేదిక అధ్యక్షులు కోరారు. సేవాలాల్ మహారాజ్ 282 జయంతిని పురస్కరించుకొని.. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. లంబాడీ గిరిజనుల సాంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయడానికే ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్ తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి రోజైన ఫిబ్రవరి 15ను రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేవాలాల్ జయంతి ఉత్సవాలకు రూ. 100కోట్లు కేటాయించాలన్నారు.
లంబాడీల ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో... మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు భాజపా నేతలు రాంచందర్ రావు, వివేక్, పేరాళ్ల చంద్రశేఖర్ రావు, గురువులు, ఐక్యవేదిక సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.