తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఆదివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్, కేంద్ర సహాయ మంత్రి క్రిషన్‌పాల్ గుర్జార్, రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం, తెలంగాణలోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే హనుమంతరావు, సినీ నిర్మాత అంబికాకృష్ణ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ ద్వార ప్రదక్షిణ చేశారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల: శ్రీవారి సేవలో ప్రముఖులు - Tirumala latest news
తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతోంది. ఆదివారం స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
![తిరుమల: శ్రీవారి సేవలో ప్రముఖులు తిరుమల: శ్రీవారి సేవలో ప్రముఖులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10021543-476-10021543-1609046718606.jpg)
తిరుమల: శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: శ్రీవారి సేవలో ప్రముఖులు