తెలంగాణ

telangana

ETV Bharat / state

వామ్మో అంత కరెంట్‌ బిల్​ కట్టాలా.. మహిళకు షాక్​

Huge electrical bill: మనం ఇంట్లో వాడే కరెంట్​కు సాధారణంగా బిల్లు రూ.200, రూ.300 లేదా రూ.500 వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఓ ఇంటికి ఏకంగా రూ.70 వేలు కరెంట్ బిల్ వచ్చింది. ఇది చూసిన మహిళ ఒక్కసారిగా షాక్​కు గురైంది. కూలీ చేసుకుని బతికేవాళ్లం.. అంత బిల్లు ఎలా చెల్లించాలని బోరున విలపించింది.

Huge electrical bill
Huge electrical bill

By

Published : Oct 28, 2022, 10:50 PM IST

Huge electrical bill: సాధారణంగా నెలనెలా వాడుకునే విద్యుత్​కు రూ.200, రూ.300 లేదా రూ.500 చొప్పున బిల్లు వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో నివసిస్తున్న సరోజా అనే మహిళ ఇంటికి మాత్రం ఏకంగా రూ.70,000 కరెంట్ బిల్ వచ్చింది. రాజీవ్ కాలనీకి చెందిన సరోజా ఇంటికి ప్రతి నెల రూ.300 నుంచి రూ.700 వరకు విద్యుత్ బిల్లు వస్తుండగా.. ఈ నెలలో మాత్రం ఒక్కసారిగా రూ.70,000 బిల్లు వచ్చింది.

దీంతో సరోజా కుటుంబీకులు కంగుతిన్నారు. బిల్లు వచ్చినప్పటి నుంచి విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారు స్పందించకపోవడంతో కాలనీలోని మహిళలందరూ ఒక్కసారిగా విద్యుత్ సబ్​స్టేషన్​ ఎదుట ఆందోళన చేశారు. గతంలో మీటర్ అధికంగా తిరుగుతోందని ఫిర్యాదు చేయగా.. అధికారులు విద్యుత్ మీటర్​ని పరిశీలించి ఎలాంటి పొరపాటు లేదంటూ మళ్లీ బిగించారని మహిళ ఆరోపించింది.

గత ప్రభుత్వ హయాంలో రూ.120 విద్యుత్ బిల్లు వస్తుండగా.. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రూ.300 నుంచి రూ.400, రూ.500, రూ.700 వరకు బిల్లు వస్తుందని సరోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలలో ఏకంగా రూ.70 వేల వరకు బిల్లు వచ్చిందని.. బిల్లు కట్టకపోవడంతో అధికారులు విద్యుత్ సరఫరా కట్​ చేశారని వాపోయారు. కూలీ చేసుకొని బతికేవాళ్లం.. అంత బిల్లు ఎలా చెల్లించాలని ఆమె బోరున విలపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details